న్యూ ఢీల్లీ: విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత  ప్రేరేపించడానికి దేశవ్యాప్తంగా దాదాపు 69,000 పెట్రోల్ పంపుల చార్జింగ్‌ కియోస్క్  ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అంతేకాకుండా, ప్రభుత్వ రిఫైనర్లకు చెందిన అన్ని కంపెనీ యాజమాన్యంలోని, కంపెనీ-ఆపరేటెడ్ (సీవోసీవో) పెట్రోల్ పంపుల వద్ద ఈవీ ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ‌వి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి ఆర్.కె. సింగ్ చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు "అన్ని సీవోసీవో పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయడానికి  చమురు మార్కెటింగ్ సంస్థలకు (ఓ‌ఎం‌సిలు) ఒక ఉత్తర్వు జారీ చేయవచ్చని" సూచనలు చేశారు.

ఇతర ఫ్రాంఛైజీ పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు తమ ఇంధన స్టేషన్లలో కనీసం ఒక ఛార్జింగ్ కియోస్క్ పెట్టేలా ఆదేశాలిస్తే దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఈ‌వి ఛార్జింగ్ సదుపాయాన్ని  తేవాలన్న లక్ష్యం సాధించడంలో సహాయపడుతుందని తెలిపింది. చమురు మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం, కొత్త పెట్రోల్ పంపులకు ఒక ప్రత్యామ్నాయ ఇంధనం ఎంపిక ఉండాలి.

also read  భారతదేశంలో ఈ ఖరీదైన హోటల్ రూం రెంటుతో సామాన్యుడు ఒక కారు కొనొచ్చు..

"కొత్త పెట్రోల్ పంపులు చాలావరకు ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక కింద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ పంపులు కూడా ఈ‌వి ఛార్జింగ్ కియోస్క్‌లను స్థాపించేటప్పుడు చాలా తేడాను కలిగిస్తుంది" అని కొన్ని  వర్గాలు తెలిపాయి.

పరిశ్రమ అంచనాల ప్రకారం, దేశంలో సుమారు 69,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఈ‌వి  ఛార్జింగ్ సౌకర్యం వల్ల  ఇ-మొబిలిటీని పెద్ద ఎత్తున పెంచుతుంది. ఇలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం ఈ‌వి కొనుగోలును నిరుత్సాహపరుస్తుంది.

కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర మరియు భోపాల్‌లపై దృష్టి సారించే విధంగా ప్రణాళికను విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. "ఏ నగరంలోనైనా రెండు లేదా మూడు ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడం నిధుల వృధా అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ఢీల్లీలో ప్రజా రవాణా పూర్తిగా విద్యుదీకరణపై  చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అంతకుముందు జూలైలో, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇతర దేశాల (చైనా మరియు పాకిస్తాన్) నుండి పరికరాలను (విద్యుత్) దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొన్న విధంగా ఇతర దేశాల నుండి ఛార్జర్లు దిగుమతి చేసుకోకూడదని విద్యుత్ మంత్రి సమావేశంలో అధికారులను ఆదేశించారు.