Asianet News TeluguAsianet News Telugu

దేశప్రజలకు కేంద్రం మరో శుభవార్త.. వంట నూనెల ధరల తగ్గింపు, కొత్త రేట్లలివే..!!

కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు మరో కానుకను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలను తగ్గించింది. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబిన్‌పై రూ.10. పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 
 

center Reduction on Edible Oil Prices
Author
Hyderabad, First Published Nov 5, 2021, 4:10 PM IST

కేంద్ర ప్రభుత్వం దీపావళి మరుసటి రోజు దేశ ప్రజలకు మరో కానుకను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలను తగ్గించింది. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబిన్‌పై రూ.10. పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 

కాగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol and Diesel Price Cut) ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel Price) పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వాహనాదారులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంది కొంతమేర ఊరట కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా దిగోచ్చిన ఇంధన ధరలు.. ఏ రాష్ట్రంలో ఎంత తగ్గిందంటే..?

ఇదిలా ఉంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. ఈ తగ్గిన ధరలు నవంబర్ 4 నుంచే అమల్లోకి రానున్నాయి. 

అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాట, గోవా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తగ్గింపుతో పాటు లీటర్‌కు రూ. 7 అదనంగా తగ్గించాయి. దీంతో అక్కడ మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 12, డీజిల్‌పై రూ. 17 తగ్గినట్టు అయింది. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ. 2 తగ్గిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను తగ్గించేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్ (himachal pradesh) ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ (jairam thakur) తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios