Asianet News TeluguAsianet News Telugu

ఒక్క దోమ కాటు డెంగ్యూకి కారణమవుతుందా? నిపుణుల సమాధానం ఏంటంటే ?

డెంగ్యూతో బాధపడుతున్న వ్యక్తుల కథలు మరియు సంఘటనలు రికవరీ కాలం చాలా బాధాకరమైనదని చూపిస్తుంది. డెంగ్యూ ప్రాణాలతో బయటపడిన ఆల్కా గుప్తా ఇలా పంచుకున్నారు, “నాకు 23 ఏళ్ళ వయసులో నాకు డెంగ్యూ వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి నాకు దాదాపు 6 నెలలు పట్టింది. 

Can a single mosquito bite cause dengue? Hear the answer from experts
Author
Hyderabad, First Published Oct 21, 2020, 2:21 PM IST

డెంగ్యూ ప్రమాదకరమైన వైరల్ డిసిజస్ అనడంలో సందేహం లేదు, డెంగ్యూతో బాధపడుతున్న వ్యక్తుల కథలు, సంఘటనలు రికవరీ కాలం చాలా బాధాకరమైనదని తెలుస్తుంది. డెంగ్యూ ప్రాణాలతో బయటపడిన ఆల్కా గుప్తా మాట్లాడుతూ, “నాకు 23 ఏళ్ళ వయసులో నాకు డెంగ్యూ వచ్చింది.

పూర్తిగా కోలుకోవడానికి నాకు దాదాపు 6 నెలలు పట్టింది. మొదట తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం వచ్చింది, అందువల్ల నాకు డెంగ్యూ ఉందని డాక్టర్ గుర్తించగలిగారు. రెండు వారాల పాటు నిరంతర మందులు వాడిన తరువాత ఇన్ఫెక్షన్ పోయింది, కాని నా బలాన్ని తిరిగి పొందడానికి, కీళ్ల నొప్పులను తగ్గడానికి, వికారం పోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది.

ఆ ఆరు నెలలు చాలా భాదకరమైనది, అప్పుడు ఒక్క దోమ కూడా ఎంతో ప్రమాదకరమని నేను గ్రహించాను. ”

చాలా మంది ఇతరులు డెంగ్యూ నుండి ప్రాణాలతో బయటడపడిన వారు వారి అనుభవాన్ని పంచుకున్నారు, అయితే ఒక ప్రశ్న ఎప్పుడూ సందేహిస్తుంది డెంగ్యూ బారిన పడటానికి ఒక్క దోమ కాటు కారణమా ? నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి సమాధానం అవును అని.

డెంగ్యూ వైరస్ మనిషి నుండి దోమ-మానవ చక్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈడెస్ ఈజిప్టి దోమ కుట్టిన తరువాత, డెంగ్యూ సంక్రమణ సంకేతాలు లేదా లక్షణాలు కనిపించడం ప్రారంభించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. ఈ దశను వైరెమియా అని పిలుస్తారు, వ్యక్తి తన రక్తంలో అత్యధిక స్థాయిలో డెంగ్యూ వైరస్ ఉన్న దశ కూడా ఇదే.

మొదట ఒకటి లేదా రెండు రోజులు వ్యక్తి ఎటువంటి లక్షణాలను కనిపించవు, కానీ ఇది త్వరగా జ్వరంతో బయటపడుతుంది. జ్వరం నిరంతరం ఉంటుంది, ఇది ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు.

డెంగ్యూ మనిషి నుండి మనిషికి వ్యాపించలేదని గుర్తుంచుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ లేదా డెంగ్యూ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాప్తి చెందే ఏకైక మార్గం దోమలు. దోమల నుండి సురక్షితంగా ఉండటం, మీ ఇంటిని దోమల నుండి దూరంగా ఉంచడం మంచిది.

గోద్రేజ్ కాలా హిట్ వంటి దోమల కిల్లర్లతో ఇంటిని క్రమం తప్పకుండా చల్లడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోవడం డెంగ్యూ రహితంగా ఉండటానికి ఉత్తమ ఎంపిక. బయటికి వెళితే, దోమ కాటును నివారించడానికి స్లీవ్‌లు ధరించడాన్ని మీరు పరిగణించవచ్చు.

ప్రస్తుత పరిస్థితిలో, కోవిడ్-19 కూడా ఇలాంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది కాబట్టి నిరంతర అధిక జ్వరం కారణాన్ని గుర్తించలేకపోయే ప్రమాదం కూడా ఉంది. లక్షణాలను అర్థం చేసుకోవడం, వాటిని సరిగ్గా గుర్తించడం సరైన చికిత్సను సకాలంలో పొందడానికి సహాయపడుతుంది.

మీరు ఇంట్లో ఒకటి లేదా రెండు దోమలను కూడా చూసినట్లయితే, వెంటనే చర్య తీసుకోండి. గోద్రేజ్ కాలా హిట్‌తో దోమను తక్షణమే చంపడం డెంగ్యూ నివారణకు ఉత్తమ మార్గం.
 

Follow Us:
Download App:
  • android
  • ios