Business Ideas: వంటిల్లు కదలకుండానే నెలకు రూ. 20 లక్షలు సంపాదిస్తున్న సాధారణ గృహిణి..ఏ వ్యాపారమో తెలిస్తే షాకే

వంటగది నుంచి ఓ సామాన్య మహిళ వ్యాపారాన్ని ప్రారంభించి నేడు నెలకు 20 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది.  ముంబైకి చెందిన కమల్ జిత్ కౌర్ 'కిమ్మస్ కిచెన్' స్థాపించి నేడు దేశంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

Business Ideas An ordinary housewife who earns 20 lakhs per month know what business MKA

కమల్ జిత్ కౌర్ విజయం గృహిణులు సైతం వ్యాపారంలో రాణించవచ్చు అనేందుకు మంచి ఉదాహరణ. ఆమె విజయవంతమైన వ్యాపార గాథ గురించి తెలుసుకుందాం. కమల్ జిత్ ఇంట్లోనే  దేశీయ నెయ్యి ఉత్పత్తి చేసి విక్రయిస్తూ నెలకు రూ.20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి విద్యా నేపథ్యం లేని కమల్ జిత్ కౌర్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచారు.  కోవిడ్ సంక్షోభ సమయంలో తన వంటగదిలో కంపెనీని ప్రారంభించిన కమల్ జిత్ కౌర్ వ్యాపారం నేడు చాలా పెద్ద స్థాయికి పెరిగింది. అతి తక్కువ కాలంలోనే లాభదాయకమైన వ్యాపారంగా ఎదిగింది. 50 ఏళ్ల వయసులో 'కిమ్మూస్ కిచెన్'ని స్థాపించిన కౌర్ తాజాగా నెయ్యి విక్రయిస్తోంది.ఆమె కంపెనీ నెయ్యి ప్రత్యేకత ఏమిటంటే ఆమె పెరుగుపై వచ్చే మీగడతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వ్యూహం ద్వారా కౌర్ ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.

కమల్ జిత్ కౌర్ 2020లో ముంబైలో 'కిమ్స్ కిచెన్'ని ప్రారంభించారు. తాజా నెయ్యి తయారీపై కంపెనీ పూర్తిగా దృష్టి సారించారు.. పంజాబ్‌లోని లుధియానాలో ఉన్నప్పుడు తాజా నెయ్యి వాడినప్పుడు ఆమెకు ఎలాంటి వ్యాధులు రాలేదని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యి, పాల ఉత్పత్తులు అక్కడ లభ్యమవుతాయని వారి నమ్మకం. పెళ్లయ్యాక ముంబైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు దొరకడం కష్టంగా మారింది. అందుకే ఇంట్లోనే సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది.

కౌర్ సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని సిద్ధం చేస్తారు. ఇందుకోసం పంజాబ్ లోని లూథియానా నగరం నుంచి పాలు తెస్తున్నారు. అయితే లూథియానా నుంచి పాలు తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కానీ కమల్ జిత్ తాను తయారుచేసే పాల ఉత్పత్తుల వాసన, నాణ్యత బాగుండాలి కాబట్టి లూథియానా నుండే పాలను తెస్తుంది.  పెరుగు నుండి నెయ్యిని ఉత్పత్తి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని మనందరికీ తెలుసు . అయితే, కమల్ జిత్ ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా నెయ్యిని ఉత్పత్తి చేస్తారు. 

Business Ideas An ordinary housewife who earns 20 lakhs per month know what business MKA

నెలకు 20 లక్షలు. కమల్ జిత్ కౌర్ సంపాదన
ఇటీవలి సంవత్సరాలలో నెయ్యికి డిమాండ్ పెరిగింది. ఇతర దేశాల ప్రజలు కూడా తమ నెయ్యి కోసం ఆర్డర్ చేస్తున్నారు. వీరి  నెయ్యి సీసాలు మూడు సైజుల్లో లభిస్తాయి. 220ml, 500ml, ఒక లీటరు పరిమాణాలలో లభిస్తుంది. ఆర్డర్ చేసిన పరిమాణం ఆధారంగా నెయ్యి ధర నిర్ణయిస్తారు. కమల్ జీత్ కౌర్ కుమారుడు ఈ కంపెనీకి సీటీఓగా పనిచేస్తున్నారు. అతను అందించిన సమాచారం ప్రకారం, అతను 2021లో ప్రతి నెలా 4500 కంటే ఎక్కువ నెయ్యి బాటిళ్లను విక్రయించాడు. దీని ద్వారా సగటున నెలకు 20 లక్షలకు పైగా సంపాదించాడు. కౌర్ ఇప్పుడు తన ఆదాయంలో 1% గురుద్వారా వచ్చే ఆకలితో ఉన్నవారికి ఆహారంగా కేటాయించడం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios