ప్రొఫెషనల్ ఐటీ సంస్థలు ఇప్పుడు టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మ్యాన్ పవర్ కొరత ఏర్పడుతోంది. ఐటీ సెక్టార్‌లో కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్న విష‌యం తెలిసిందే.  

సమాచార విప్లవంతో దేశ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. ఐటీ సెక్టార్‌లో కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు నిరుద్యోగులకు శుభవార్త తెలిపాయి. దేశంలో నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలు అయిన కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ భారీ ప్రకటన వెలువరించాయి. దేశవ్యాప్తంగా రానున్న ఏడాది కాలంలో సుమారు 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉన్న తమ కార్యాలయాల్లో ఈ రిక్రూర్‌మెంట్లు జరుగుతాయని తెలిపాయి. కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ సంస్థలు ఈ ఏడాదిలో ఏకంగా 55 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాయని టాలెంట్ సొల్యూషన్ సంస్థ ఎక్స్‌ఫెనో తన నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం 55 వేల ఉద్యోగాల్లో 52 వేల మంది కేవలం టెక్నాలజీ రంగంలోనే తీసుకున్నాయని తెలిపింది. మిగతా సెక్టార్‌లో కేవలం 3 వేల మంది మాత్రమే రిక్రూట్‌ అయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఐటీ సెక్టార్లలో లక్షల్లో జీతాలు ఉన్నా ఆట్రిక్షన్ రేటు కలవర పెడుతోందని తెలిపింది. ఐటీ సంస్థల్లో వార్షిక అట్రిక్షన్ రేటు 23 శాతం నమోదు అవుతోందని వెల్లడించింది.

ప్రొఫెషనల్ ఐటీ సంస్థలు ఇప్పుడు టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మ్యాన్ పవర్ కొరత ఏర్పడుతోంది. దీంతో అనుభవం ఉన్నవారితో పాటు క్యాంపస్‌ ద్వారా ఫ్రెషర్లను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక విదేశాల్లో స్థిరపడ్డ ఎన్.ఆర్.ఐ లలో ఇరవై శాతం మంది ఈ నాలుగు సంస్థలలోనే పనిచేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అటు ఆన్‌షోర్‌లో ఇటు ఆఫ్‌ షోర్‌లో ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు కాసుల పంట పండిస్తున్న ఈ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

ఐటీ సెక్టార్‌లో ముఖ్యంగా డిజిటల్‌ రంగంలో, అడ్మినిస్ట్రేషన్‌లో, సైబర్ సెక్యూరిటీలో ఎక్కువగా హైరింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు సంస్థల్లో కలిపి ఏకంగా 2,10,000 మంది పని చేస్తున్నారు. ఇక రానున్న మరో రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టెక్ విభాగాల్లో డెవలపర్స్, క్లౌడ్ టెక్, డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, మొబిలిటీ, సైన్స్, వర్చ్యులైజేషన్, అనలటిక్స్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక నాన్ టెక్ జోన్లలో ఫైనాన్స్ స్పెషలిస్ట్స్, బిజినెస్ అనలిస్ట్స్, , బిజినెస్ ఆపరేషన్స్ కన్సల్టింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిట్ స్పెషలిస్ట్ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్నాయి.