Asianet News TeluguAsianet News Telugu

BSNL బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్: తక్కువ ధరకే ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్..!

జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీల రీఛార్జ్ ధరలు పెరిగిన తరువాత అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్ లాభాలను ఆఫర్ చేస్తున్న టెలికం కంపెనీగా BSNL నిలిచింది.

BSNL Recharge Plans
Author
Hyderabad, First Published Jan 18, 2022, 5:31 PM IST

జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ యాజమాన్య టెలికం కంపెనీల రీఛార్జ్ ధరలు పెరిగిన తరువాత అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్ లాభాలను ఆఫర్ చేస్తున్న టెలికం కంపెనీగా BSNL నిలిచింది. BSNL అందించిన కొన్ని ప్లాన్స్ అయితే కేవలం నామమాత్రపు చవక ధరకే ఏకంగా 5 నెలల వరకూ వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ లాభాలను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే.. BSNL అందించే బెస్ట్ బడ్జెట్ అన్ లిమిటెడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్
BSNL రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 నిమిషాలు ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 నిమిషాలు ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిమిషానికి 30 పైసలు చెల్లించాలి. అద‌నంగా ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL రూ.197 ప్లాన్
BSNL రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ100 SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే.. ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలిడిటీ అన్ని నెట్‌వర్క్‌ల‌కు అన్ లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 

BSNL రూ.397 అన్ లిమిటెడ్ ప్లాన్ 
BSNL రూ.397 అన్ లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్ వ‌ర్క్‌ల‌కు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి. 

BSNL రూ.499 STV ప్లాన్
BSNL రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు అన్ లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 100 SMSలను కూడా తీసుకువస్తుంది. అదనంగా.. ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది. 
  

Follow Us:
Download App:
  • android
  • ios