Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 31న బ్లూ మూన్.. మళ్ళీ చూడాలంటే 19 సంవత్సరాలు వేచి ఉండాలి..

చాలా కాలం తరువాత ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినప్పుడు ఇలాంటి యాదృచ్చికం జరుగుతుంది. బ్లూ మూన్ అంటే ఏమిటి,  ఏ సమయంలో మీకు ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందో తెలుసుకుందాం..

blue moon october 2020 date time india halloween blue moon will occur october 31 know timings details-sak
Author
Hyderabad, First Published Oct 30, 2020, 5:54 PM IST

ఈ సంవత్సరం భారతదేశంలో బ్లూ మూన్ తేదీ అక్టోబర్ 31 వస్తుంది, అవును ఈ సంవత్సరంలో   అక్టోబర్ 31 శరద్ పూర్ణిమ మాత్రమే కాదు, ఈ రోజున హాలోవీన్ కూడా ఉంది. హాలోవీన్ అనేది క్రైస్తవుల పండుగ.

చాలా కాలం తరువాత ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినప్పుడు ఇలాంటి యాదృచ్చికం జరుగుతుంది. బ్లూ మూన్ అంటే ఏమిటి,  ఏ సమయంలో మీకు ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందో తెలుసుకుందాం..

 బ్లూ మూన్ అంటే ఏమిటి ?

also read నవంబరులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి.. ...

బ్లూ మూన్ అనేది ఒక ఖగోళ సంఘటన, ఇది రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. కానీ 2020లో బ్లూ మూన్ కనిపించిన తరువాత, మళ్ళీ 2039లో బ్లూ మూన్ కనిపిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం బ్లూ మూన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని కూడా కొందరు చెబుతున్నారు.

బ్లూ మూన్ వచ్చే తేదీ, సమయం..

ఈ సంవత్సరం బ్లూ మూన్ అక్టోబర్ 31 రాత్రి 8:19 గంటలకు రానుంది. ప్రజల సమాచారం కోసం అక్టోబర్ 31 రోజు ప్రత్యేక యాదృచ్చికంగా ఉండనుంది, అవును ఈ రోజు శరద్ పూర్ణిమ అలాగే క్రైస్తవుల పండుగ హాలోవీన్ కూడా.

 బ్లూ మూన్ ఎలా కనిపిస్తుంది ?

బ్లూ మూన్ అనే పేరు చంద్రుడు నీలం రంగులో కనబడుతుందని కాదు, 1 నెలలో రెండు పౌర్ణమిల సందర్భంగా రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు. చంద్రుడు పసుపు, తెలుపు రంగులో కాకుండా ఈసారి బ్లూ మూన్ భిన్నంగా కనిపించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios