ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో బిలియనీర్ బిల్ గేట్స్ సోమవారం రోజున వేసవి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం 2020లో ప్రసంగిస్తూ బిల్ గేట్స్ ఈ ప్రకటన చేశారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి గ్లోబల్ కమ్యూనిటీ చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి వైరస్ మహమ్మారిని సమర్థవంతంగా పరిష్కరించడానికి టీకా ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడం అవసరం అని మాజీ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ నొక్కిచెప్పారు. కోవిడ్-19 ఎదురుకోవడంలో భారతదేశ పరిశోధన, ఉత్పాదక సామర్థ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని బిల్ గేట్స్ పునరుద్ఘాటించారు.

also read వృద్ధిని పెంచడానికి భారత తయారీ రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది: ముకేష్ అంబానీ ...
    
గత రెండు దశాబ్దాలుగా భారతదేశం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు  తీసుకుంటున్న అనేక చర్యల "చాలా ఉత్తేజకరమైనది" అని ఆయన అన్నారు. భారతదేశ పరిశోధన, తయారీ కోవిడ్-19తో పోరాడటానికి కీలకం, ముఖ్యంగా పెద్ద ఎత్తున టీకాలు తయారుచేసేటప్పుడు," అని ఆయన చెప్పారు.

mRNA వ్యాక్సిన్ తయారీ స్కేల్ చేయడం కష్టం, లాజిస్టికల్ సవాళ్లకు విస్తృతమైన కోల్డ్ చైన్ అవసరం. టీకాను మరింత థర్మో స్థిరంగా చేయడానికి భవిష్యత్తులో mRNA ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయవచ్చు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అభివృద్ధికి మరింత పరిశోధన అవసరం. చౌకైన, వేగవంతమైన మోనోక్లోనల్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

బిల్ గేట్స్ ప్రకారం, సున్నితమైన ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి సమయం ఆసన్నమైంది. కోవిడ్-19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఇది దేశాలను ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేసిందని గేట్స్ చెప్పారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం 2020 అక్టోబర్ 19న ప్రారంభమైంది, అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది.