రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ బిలియనీర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వృద్ధిని పెంచడానికి భారత్ తయారీ రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది.

"భారతదేశంలో తయారీ రంగాన్ని పునర్నిర్మించాల్సి అవసరం ఉంది. అలాగే చిన్న, మధ్య తరహా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది" అని అంబానీ సోమవారం సాయంత్రం ఒక పుస్తక ఆవిష్కరణలో అన్నారు.

లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలు మూత పడటం, సంస్థలు ఉద్యోగాల కొత విధించడం తరువాత చారిత్రాత్మక వార్షిక సంకోచానికి సిద్ధమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై ముకేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

also read ముకేష్ అంబానీ వ్యాపారంలోనే కాదు ఫ్రెండ్ షిప్ లో కూడా చాలా ఫేమస్.. ఎలా అనుకుంటున్నారా ? ...

తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన ఇంధన కార్యకలాపాల నుండి రిటైల్, డిజిటల్ సేవలు వరకు దూసుకెళ్తున్న రిలయన్స్ గత నెలలో విదేశీ పెట్టుబడిదారుల నుండి 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులను సంపాదించింది.

ముకేష్ అంబానీ ప్రధానంగా మూడు రంగాలను వివరించాడు, ఇంతకు ముందెన్నడూ ఊహించని విధంగా భారతదేశాన్ని డిజిటల్ సమాజంగా మార్చడం, భారతదేశ విద్యావ్యవస్థను పెంచడం, ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇంధన రంగాన్ని మార్చడం.

"నేను దీనిని సాధించడంలో నా చిన్న పాత్ర పోషించగలిగితే, ఈ లక్ష్యాలను శాశ్వతంగా నిలబెట్టడానికి నేను సంస్థలను సృష్టించగలిగితే, నేను నా పనిని పూర్తి చేసినట్టు" అని ముకేష్ అంబానీ అన్నారు.