హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

టెక్నాలజీ రంగంలో జూనియర్లకు అత్యధిక వేతనాలిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. మన భాగ్య నగరం రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ తెలిపింది

Bengaluru job fetches the highest average salary package

న్యూఢిల్లీ: జూనియర్ స్థాయి ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు లభిస్తున్నాయి. దేశంలోనే భాగ్యనగరం ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నది. వార్షిక వేతనం సగటున రూ.5 లక్షలుగా ఉన్నట్లు రాండ్‌స్టడ్ ఇన్‌సైట్స్ సాలరీ ట్రెండ్స్ రిపోర్ట్-2019 తెలిపింది. 

జూనియర్ టెక్కీలకు ఉద్యోగాల కల్పనలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. అక్కడ జూనియర్-లెవల్ ఉద్యోగులకు ఏటా సగటున రూ.5.27 లక్షలు వస్తున్నాయి. కాగా, మధ్య శ్రేణి ఉద్యోగులకు రూ.16.45 లక్షలు, సీనియర్ స్థాయి ఉద్యోగులకు రూ.35.45 లక్షలు సగటు వార్షిక జీతాలు అందుతున్నాయి.

also read  ఫ్రీడం కావాలి... కేంద్ర మంత్రికి తేల్చి చెప్పిన కార్పొరేట్ ఇండియా

దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ తెలిపింది. గత రెండేళ్లలోనూ సాలరీ ట్రెండ్స్ రిపోర్టుల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా, ఈ ఏడాదీ దాని ఆధిపత్యం కొనసాగింది. జూనియర్ల జీతాల విషయంలో ముంబై మూడో స్థానంలో ఉండగా, ఏటా సగటున రూ.4.59 లక్షలు వస్తున్నాయి. అయితే మిడ్-లెవల్ ఉద్యోగుల జీతాల్లో ముంబై (రూ.15.07 లక్షలు) నగరం రెండో స్థానంలో ఉన్నది. 

ఢిల్లీ ప్లస్ దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలో వేతనాలు రూ.14.50 లక్షలు అందుతున్నాయి. తద్వారా జాబితాలో హస్తిన మూడో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లోనూ ముంబై రూ.33.95 లక్షలతో రెండో స్థానంలో ఉండగా, పుణె రూ.32.68 లక్షలతో మూడో స్థానంలో ఉన్నది.

Bengaluru job fetches the highest average salary package

ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్న రంగాల్లో ఐటీ రంగం మరోసారి టాప్‌లో నిలిచింది. ఈ రంగంలో జూనియర్ ఉద్యోగులకు సగటున రూ.4.96 లక్షల వార్షిక వేతనం అందుతున్నది. సీనియర్ ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.35.84 లక్షలుగా ఉన్నదని రాండ్‌స్టడ్ తమ తాజా నివేదికలో చెప్పింది. కాగా, డిజిటల్ మార్కెటీర్లు కూడా సీనియర్ స్థాయి ఉద్యోగులకు అత్యధిక వేతనాలను ఇస్తున్నట్లు తేలింది. సగటున రూ.35.65 లక్షలు ఇస్తున్నారని రాండ్‌స్టడ్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో రాండ్‌స్టడ్ ఈ సర్వే నిర్వహించింది.

also read ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ లో సల్మాన్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ...

15 రంగాల్లోని వివిధ శ్రేణుల్లోని లక్ష మంది ఉద్యోగుల వార్షిక వేతనాలను పరిశీలించింది. అన్ని రంగాల్లో నిపుణులకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఈ సర్వే జరుగగా, వివిధ శ్రేణుల్లోని లక్షమంది జీతాలను పరిశీలించారు.

క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్రుత్రిమ మేధ, యాంత్రీకరణ నైపుణ్యం గల వారికి ఈ ఏడాది అధికంగా గిరాకి ఉన్నది. జీఎస్టీ వ్రుత్తి నిపుణులకు ప్రొడక్షన్, సర్వీస్ రంగాల నుంచి గిరాకీ లభించింది. ఈ ప్రత్యేకత గల స్పెషలిస్టులు, అకౌంటెంట్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, న్యాయవాదులకు ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios