బ్యాంక్ చెక్ పైన డేట్ రాస్తున్నారా?...అయితే జాగ్రత్త....లేదంటే..?
కొత్త సంవత్సరం నుంచి బ్యాంకు చెక్కు విషయం లో మీకు ఓ చిక్కు ఉండబోతుంది. డాక్యుమెంట్లు, చెక్కులపై డేట్స్ రాసే విషయంలో జాగ్రతగా ఉండాలి. చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై డేట్ వేసే సమయంలో జాగ్రత్తగా వహించకపోతే పెద్ద ప్రమాదం జరగవచ్చు.
మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం నుంచి బ్యాంకు చెక్కు విషయం లో మీకు ఓ చిక్కు ఉండబోతుంది. చెక్కుల పై వేసే డేట్ విషయంలో కస్టమర్లకు ఓ సమస్య ఏర్పడనుంది. చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై డేట్ వేసే సమయంలో జాగ్రత్తగా వహించకపోతే పెద్ద ప్రమాదం జరగవచ్చు.
also read బ్యాంకుల్లో లక్షల కోట్ల మోసాలు...గుర్తించించిన ఆర్బీఐ
సదరణంగా చెక్ పైన డేట్ రాయాలంటే చాలామంది 25/01/20 ఇలా రాసే అలవాటు ఉంటుంది కానీ ఇక్కడే మీకు సమస్య ఎదురవుతుంది. మీరు డేట్ లో సంవత్సరం దగ్గర కేవలం 20 అని రాసి వదిలేస్తే ఆ 20 నెంబర్ తర్వాత ఏ నెంబర్ అయినా రాయొచ్చు. 20 తర్వాత 18 రాస్తే 2018 అవుతుంది అలాగే 19 రాస్తే 2019 అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్లు, చెక్‌లపైన తేదీలను మార్చడం చాలా సులువు.
మీరు భవిష్యత్తు ఎప్పుడైనా డేట్‌తో చెక్, లేదా డాక్యుమెంట్ రాసి ఎవరికైనా ఇచ్చినా దాన్ని 2018 లోనో, 2019 లోనో ఇచ్చినట్టు మారిస్తే మీరు చిక్కుల్లో పడిపోతారు. అందుకే డాక్యుమెంట్లు, చెక్కులపై డేట్స్ రాసే విషయంలో చాలా జాగ్రతగా ఉండాలి. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే డేట్స్ రాసే ముందు సంవత్సరాన్ని పూర్తిగా రాస్తే సరిపోతుంది.
also read రిలయన్స్ రిటైల్ వాల్యూ ఎంతో తెలుసా....అక్షరాల....
ఎలాంగంటే 2020 జనవరి 28 అని చెక్ పైన డేట్ రాయాలంటే 28/01/2020 అని పూర్తిగా రాయాలి. అప్పుడు ఆ డేట్ లను మార్చే అవకాశం ఎవరికి ఉండదు. ఇక నుంచి ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్లలో, చెక్‌లపైన పూర్తిగా డేట్ రాయడం మర్చిపోవద్దు లేదంటే కొందరు మిమ్మల్ని డేట్ లను మార్చి చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది.