Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ రిటైల్ వాల్యూ ఎంతో తెలుసా....అక్షరాల....

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్ సంస్థలో షేర్ల మార్పిడి అమలులోకి తెచ్చారు. నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు ఒక రిలయన్స్ షేర్ చొప్పున బదలాయింపు చేపట్టడంతో రిటైల్ విలువ 34 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది.
 

mukesh Ambani's Reliance Retail value USD 34 billion dollars
Author
Hyderabad, First Published Dec 27, 2019, 10:45 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిటైల్‌ వ్యాపార స్టోర్ల నిర్వహణ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ తన వాటాదారుల కోసం షేర్ల మార్పిడి పథకాన్ని ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ విలువను రూ.2.4 లక్షల కోట్లు (34 బిలియన్ డాలర్లు)గా తేల్చారు. నూతన షేర్ల మార్పిడి పథకంలో భాగంగా లెక్కగట్టారు. 

భారతీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ఈ రిలయన్స్ రిటైల్. ఇది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థేగాక, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పరోక్ష అనుబంధ సంస్థ కూడా. ఈ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌కు చెందిన అన్‌లిస్టెడ్‌ అనుబంధ విభాగం. మాతృసంస్థ ఆర్‌ఐఎల్‌కు పరోక్ష అనుబంధ విభాగం.

ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ వాటాదారుల కోసం షేర్ల మార్పిడి పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతీ నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు మార్కెట్ లీడర్‌గా ఉన్న ఒక్క ఆర్‌ఐఎల్ షేర్ లభించనున్నది. ఫలితంగా రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలింది. 

also read దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు

అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (డీమార్ట్) విలువ కంటే ఇది రెండింతలు ఎక్కువ. బ్రిటన్ బహుళజాతి సంస్థ టెస్కో విలువ సైతం 32 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. రిలయన్స్ రిటైల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లు నడుస్తున్న సంగతి విదితమే. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్ షేర్ రూ.1,515.95 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ సంపద రూ.9.6 లక్షల కోట్లుగా నమోదైంది.

రిలయన్స్ రిటైల్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టాలని ముకేశ్ అంబానీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఈ మేరకు సంకేతాలివ్వగా, వచ్చే ఐదేళ్లలో స్టాక్ ఎక్సేంజ్‌ల్లోకి రిలయన్స్ రిటైల్ రావచ్చన్నారు. రిలయన్స్ రిటైల్ నికర అమ్మకాలు నిరుడు రూ.1.3 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 10,901 స్టోర్లు ఉన్నాయి. కాగా, 2006, 2007ల్లోనే రిలయన్స్ తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లు ఇచ్చింది.

ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్‌లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు 99.95 శాతం వాటా ఉంది. షేర్ల మార్పిడి పథకం ద్వారా 0.05 శాతం వాటా కల ఉద్యోగులకు తమ ఈక్విటీని ఆర్‌ఐఎల్‌ షేర్ల రూపంలోకి మార్చుకునే అవకాశం కల్పిస్తోంది.ఇదిలా ఉంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై ధర్మాసనం ఈ నెల 17న ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా రిలయన్స్ రిటైల్ షేర్ల మార్పిడి పథకం ఆమోదం కోసం వచ్చే నెల 23న రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఈక్విటీ వాటాదారుల సమావేశం జరుగుతుందని సంస్థ వెల్లడించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రిలయన్స్ రిటైల్ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ.41,202 కోట్లుగా ఉన్నది. నిర్వహణ లాభం 66.8 శాతం పెరిగి రూ.2,322 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 24.5 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్టోర్ ఏరియా దీని ఆధ్వర్యంలో ఉన్నది.

రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నది. హైపర్ మార్కెట్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, స్పెషాల్టీ స్టోర్లు, షాపింగ్ ఔట్‌లెట్లు, కన్వీనియెన్స్ స్టోర్లు, హోల్‌సేల్, క్యాష్ అండ్ క్యారీ లావాదేవీలు, గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు, కలెక్షన్ సెంటర్లు, డిపోలు, షోరూంల ఏర్పాటులో రిలయన్స్ రిటైల్ దూసుకుపోతున్నది. 

సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 27% వృద్ధి చెంది రూ.41,202 కోట్లకు చేరుకుంది. డీమార్ట్‌ పేరుతో దేశంలో అతిపెద్ద గొలుసుకట్టు సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్‌తో పోలిస్తే రిలయన్స్‌ రిటైల్‌ విలువ రెట్టింపు. బ్రిటన్‌ రిటైల్‌ దిగ్గజం టెస్కో మార్కెట్‌ విలువ (3,200 కోట్ల డాలర్లు)తో పోల్చినా ఎక్కువే.

also read  బ్లూ చిప్‌తోనే లాభాలు... బట్ వెనుకబడ్డ మిడ్ స్మాల్ క్యాప్

వచ్చే ఐదేళ్లలో రిలయన్స్‌ రిటైల్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆగస్టులో జరిగిన ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ కింద రిలయన్స్‌ రిటైల్‌ 2006, 2007ల్లో ఉద్యోగులకు స్టాక్‌ ఆప్షన్లను కేటాయించింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు ఈ స్టాక్‌ ఆప్షన్స్‌ను కంపెనీ ఈక్విటీ షేర్లుగా బదలాయించుకున్నారు. 

వాటిని ద్రవ్య రూపంలోకి మార్చుకునేందుకు వీలుగా ఎగ్జిట్‌ ఆప్షన్‌ను కల్పించాలని ఉద్యోగుల నుంచి అభ్యర్థనలు అందుతున్నాయని, వారి కోసమే షేర్ల మార్పిడి పథకాన్ని ప్రకటించినట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌కు 99.95 శాతం వాటా ఉంది. మిగతా 0.05 శాతం వాటా మాత్రమే ఉద్యోగుల చేతుల్లో ఉంది. 

వాణిజ్య, పారిశ్రామిక, శాస్త్రీయ, గృహ, ఆహారోత్పత్తి, కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌తోపాటు ఇతర నిత్యవసరాలను మార్కెటింగ్ చేస్తున్నది. మరింతగా అటు మార్కెట్‌పరంగా, ఇటు వ్యాపారపరంగా విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios