మార్చి 31, ఆదివారం సెలవు దినం రోజున బ్యాంకులు పనిచేయనున్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ రోజు ప్రభుత్వ శాఖలు  నిర్వహించే శాఖలు తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల కార్యాలయాలు  మార్చి 31వ తేదిన పనిచేయాలని కేంద్రప్రభుత్వం  సూచించింది. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వ లావాదేవీలన్నీ కూడా ఈ ఆర్ధిక సంవత్సర ఖాతాల్లో ప్రతిబింబించేలా చూడాలని తెలిపింది.

ఇందుకు ఏజెన్సీ బ్యాంకుల శాఖల్లోని  కౌంటర్లు ఈ నెల 30వ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు, 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ తన ఆదేశాల్లో పేర్కొంది.