Asianet News Telugu

హైదరాబాద్ ప్లాంట్లో భారీగా పెట్టుబడి పెట్టనున్న ఆజాద్ ఇంజనీరింగ్.. స్థానికంగా 1,500 కొత్త ఉద్యోగాలు..

స్థానికంగా 1,500 ఉద్యోగాలను సృష్టించే దిశగా హైదరాబాద్ సంస్థ డిఎంఐ మేనేజ్‌మెంట్ నుండి మొదటి రౌండ్‌లో 20 మిలియన్ల (సుమారు రూ. 145 కోట్లు) ను సమీకరించింది.

Azad Engineering to invest  80 million dollars  in Hyderabad plant  that will create 1,500 jobs locally
Author
Hyderabad, First Published Jun 15, 2021, 12:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్  డిఎంఐ మేనేజ్‌మెంట్ నుండి 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 145 కోట్లు) నిధులతో మొదటి రౌండ్ విజయవంతంగా ముగించింది. ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ  హైదరాబాద్ లో రెండవ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించనుంది.  దీని ద్వారా స్థానికంగా 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.

ఈ సంస్థ  కొత్త ప్లాంట్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) కేటాయించిన 50 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఈ సౌకర్యం విజయవంతం తరువాత, ఏరోస్పేస్ మరియు ఎనర్జీ భాగస్వాములను తీర్చడానికి పెరిగిన సామర్థ్యాన్ని అందించడానికి తయారీ సామర్థ్యం విస్తరించబడుతుంది.

సంస్థ  విస్తరణ ప్రణాళిక వచ్చే ఐదేళ్ళలో 250 మిలియన్ డాలర్ల (రూ. 1,800 కోట్లకు పైగా)  ఆర్డర్ బుక్  చేయడానికి సహాయపడుతుంది. జి‌ఈ, మిత్సుబిషి, సిమెన్స్, తోషిబా, మ్యాన్, దూసాన్ స్కోడా, జి‌ఈ ఏవియేషన్, బోయింగ్, హనీవెల్, ఈటన్ కార్పొరేషన్, రాఫెల్, భెల్, హెచ్‌ఏ‌ఎల్, బేకర్ హ్యూస్ వంటి గ్లోబల్ ఓ‌ఈ‌ఎంలకు ఆజాద్ అర్హత కలిగిన టైర్ 1 భాగస్వామి.

 రాకేశ్ చోప్దార్ చేత 2008లో స్థాపించబడిన ఆజాద్ ఇంజనీరింగ్ విద్యుత్ ఉత్పత్తి, విమాన ఓ‌ఈ‌ఎంలకు ఉపయోగించే నిచే టర్బైన్ అండ్ ఏరోస్పేస్ పరిశ్రమ కోసం  హైలి ఇంజనిర్డ్, కాంప్లెక్స్, సూపర్ క్రిటికల్ రొటేటింగ్ భాగాలను తయారు చేస్తుంది.

ఆజాద్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ, "ప్రస్తుత పరిశ్రమ దృక్పథం, కంపెనీ ఉత్పత్తుల పోటీతత్వం ఇంకా పనితీరును బట్టి ఆజాద్ తన క్లయింట్స్ ప్రతి ఒక్కరితో ఇప్పటికే ర్యాంప్-అప్  వేగం చేసింది. రాబోయే ఐదేళ్ళలో కంపెనీ 50 శాతం సిఎజిఆర్ వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

also read ఎల్‌ఐ‌సి కస్టమర్లకు అలర్ట్.. అనుమతి లేకుండా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. ...

డిజైన్ ప్రాసెస్, ఉత్పత్తి  నుండి సప్లయి చైన్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ వరకు డిజిటల్ తయారీ, పారిశ్రామిక కృత్రిమ మేధస్సును ఉపయోగించి మొత్తం తయారీ పరిశ్రమను మార్చాలని ఆజాద్ ఇంజనీరింగ్ సంకల్పించింది.

డి‌ఎం‌ఐ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అన్షుమాన్ మలూర్ మాట్లాడుతూ “ఆజాద్ ఇంజనీరింగ్  నాణ్యత గ్లోబల్ కస్టమర్  శ్రేష్ఠతకు నిదర్శనం.” అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ “గ్లోబల్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ మ్యాప్‌లో ఆజాద్ భారత ఉనికిని నిర్ధారించింది. ఆజాద్ అన్ని అడ్డంకులను అధిగమించి  నేడు ప్రపంచ ఓ‌ఈ‌ఎం అత్యంత ఇష్టపడే & ఇష్టమైన సరఫరాదారుగా నిలిచింది. ఈ సంస్థకు మద్దతు ఇవ్వడం, ఇంజనీరింగ్ క్లస్టర్‌ను సృష్టించడం తెలంగాణ ప్రభుత్వం గర్వంగా ఉంది. అలాగే హైదరాబాద్‌లో 1,500 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తుంది.

ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన ఆజాద్ ప్రపంచ విద్యుత్ ఉత్పత్తి & ఏరోస్పేస్ ఓ‌ఈ‌ఎంల కోసం వన్-స్టాప్ భాగస్వామిగా  నిలిచింది.  ఎంపికైన భాగస్వామిగా తన సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని ఇంకా రాబోయే 18 నెలల్లో కొత్త సదుపాయంతో ప్రధాన స్థానాన్ని పొందాలని కంపెనీ భావిస్తోంది.

ఆజాద్ ఇంజనీరింగ్ గురించి -
ఫస్ట్ జనరేషన్  వ్యవస్థాపకుడు రాకేశ్ చోప్దార్ చేత 2008లో స్థాపించిన ఆజాద్ ఇంజనీరింగ్, పవర్ జనరేషన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఓ‌ఈ‌ఎంలకు ఉపయోగించే నిచే టర్బైన్ అండ్ ఏరోస్పేస్ పరిశ్రమ కోసం హైలి ఇంజనీరేడ్, క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ రొటేటింగ్ భాగాల ప్రపంచ స్థాయి తయారీ సంస్థ. ఆజాద్ ఇప్పటికీ భారతదేశంలో ఏకైక అధిక క్వాలిఫైడ్ రొటేటింగ్ తయారీ సంస్థ. గత కొన్ని సంవత్సరాలుగా ఆజాద్ అర్హతలను పొందడంపై దృష్టి కేంద్రీకరించింది. నేడు  క్లయింట్ బేస్ కోసం అన్ని మోడల్స్ అండ్ ఫ్రేమ్‌లకు అర్హత సాధించింది.  

మరింత సమాచారం కోసం,సంప్రదించండి:

సుదర్శన్ డి | వర్తీక పిఆర్ | మోబ్: + 91.8125071566/9246371566
 

Follow Us:
Download App:
  • android
  • ios