ఆడికార్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్‌....

 ప్రముఖ ఎస్‌యూవీ మాడల్ లపై మొత్తంగ సుమారు రూ. 6 లక్షల వరకు భారీ తగ్గింపును ఆడి కార్స్ ఆఫర్‌ చేస్తోంది.  లిమిటెడ్ పీరియడ్  ఆఫర్‌గా ఈ  డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 

audi cars offer huge discounts on two models

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ప్రియులకు, వినియోగదారులకు కళ్ళు చెదిరే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  ప్రముఖ ఎస్‌యూవీ మాడల్ లపై మొత్తంగ సుమారు రూ. 6 లక్షల వరకు భారీ తగ్గింపును  ఆఫర్‌ చేస్తోంది.  లిమిటెడ్ పీరియడ్  ఆఫర్‌గా ఈ  డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

audi cars offer huge discounts on two models

 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్'  ఆఫర్‌లోభాగంగా  ఐకానిక్ మోడల్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. 2009లో ఇండియాలో లాంచ్‌ చేసిన పాపులర్‌ క్యూ 5, క్యూ 7 ఎస్‌యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు  తగ్గించింది.

also read 300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

ఆడి  పోర్ట్‌ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్ల కార్లు భారతదేశంలో లాంచ్‌ చేసి దశాబ్దం పూర్తి కావడంతో,  ఆడి  కార్లను ప్రేమించే కస్టమర్లకు  ప్రత్యేక ధరల గిఫ్ట్  ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది.

audi cars offer huge discounts on two models
ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5  ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు.  అయితే ఆఫర్‌ కింద ఇది రూ .49.99 లక్షలకే లభ్యం కానుంది. మొత్తంగా దీని  తగ్గింపు  ధర రూ. 5.81 లక్షలు అన్నమాట. క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే ఆఫర్‌ కింద  రూ .4.83 తగ్గింపుతో  రూ .68.99 లక్షలకు లభిస్తుంది.
క్యూ 7 డీజిల్ ఆప్షన్‌  కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది.  అయితే దీని అసలు ధర  ధర రూ .78.01 లక్షలు.  దీని తగ్గింపు ధర రూ .6.02 లక్షలు

also read చైనాలో మొదలైన 5G సేవలు: ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా ?

ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5,  క్యూ 7  కార్లు మంచి  ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో  ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం నుండి కాగా స్టాక్ కొనసాగే వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని ఆడి తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios