Asianet News TeluguAsianet News Telugu

‘ఐటీ’ చేదు గుళిక: కృత్రిమ మేధస్సుకే పెద్దపీట.. కొత్త కొలువుల ఆశలు కొండెక్కినట్లే?!

యువ ఇంజినీర్లకు మున్ముందు చేదు గుళిక వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగపు కంపెనీల్లో కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదని తేలింది

At 1 lakh new jobs, hiring will be flat in FY19: Nasscom

హైదరాబాద్: యువ ఇంజినీర్లకు మున్ముందు చేదు గుళిక వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగపు కంపెనీల్లో కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదని తేలింది. ఐటీ రంగంలో ఈ ఏడాది కూడా ఆశించిన గరిష్ట స్థాయిలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాకపోచ్చని ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌ తేల్చేసింది.

ఐటీ సంస్థలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినా.. ఉన్నవారితోనే సేవలు
2018 తొలి త్రైమాసికంలో టాప్‌ ఐటీ కంపెనీలు మెరుగైన ఫలితాలను  ప్రకటించినా, పరిశ్రమ నియామకాలు ఆశించిన గరిష్ట స్థాయిలో ఉండవని నాస్కామ్‌ జరిపిన అధ్యయనంతో తేలింది. ముఖ్యంగా టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి దేశీయ టాప్‌ ఐటీ కంపెనీల తొలి త్రైమాసికానికి ఆశాజనకమైన ఆర్థిక ఫలితాలనే ప్రకటించాయి. కానీ ఆ సంస్థలు కొత్తవారిని కొలువుల్లోకి తీసుకునే విషయంలో అనాసక్తతతో ఉన్నాయని తెలుస్తోంది. ఉన్న సిబ్బందితోనే గరిష్టంగా పనులు చేయించుకోవాలని యోచిస్తున్నట్టుగా ఆ ఆధ్యయనం సారాంశం. నియామ​కాల వృద్ధి ఈ సంవత్సరం స్తబ్దుగానే ఉంటుందని  ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్త కొలువులు లక్ష మందికే పరిమితం
నాస్కామ్‌ విశ్లేషణ ప్రకారం, ఐటీ పరిశ్రమ 2018-19లో కొత్తగా కేవలం లక్ష కొత్త ఉద్యోగాలను మాత్రమే అందుబాటులోకి వస్తాయని సమాచారం. గత ఏడాది జూన్‌లో ఐటీ, బీపీఎం పరిశ్రమలలో 1.3-1.5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్‌ అంచనా వేసింది. ఈ అంచనాలకు తల కిందులై కేవలం లక్షకు లోపే నియామకాలే నమోదు కావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ నియామకాలు ఫ్లాట్‌గా ఉండనున్నాయని అంచనాకు వచ్చింది. అయితే 2016-17లో పరిశ్రమలో నికరంగా 1.7 లక్షల మంది కొత్త వారికి ఉద్యోగాలు లభించాయి.  

అత్యధిక కొలువులు కృత్రిమ మేధస్సులోనే..
సంప్రదాయ కొలువుల్లోకి కొత్తవారిని తీసుకొనే బదులు వారి పనిని ఇతరులతో చేయిస్తూ కృత్తిమ మేథస్సు విభాగంలో ఎక్కువగా కొత్తస్టాఫ్‌ను తీసుకోవాలని ఐటీ సంస్థలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు ఎక్కువగా కృత్రిమ మేథస్సు (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బిగ్‌ బేటా ఎనలటిక్స్‌ (బీడీఏ) వైపు మళ్లనున్నాయని నాస్కామ్‌ అధ్యక్షులు డెబ్జానీ ఘోష్‌ అన్నారు. ఈ విభాగాల్లో 2018లో మొత్తం కొలువులు డిమాండ్‌ 5.11 లక్షల ఉద్యోగాల వరకు ఉందని తెలిపారు. ఇది 2021నాటికి 7.86 లక్షలకు చేరుకుంటుందని అన్నారు. 
సైబర్ సెక్యూరిటీ రంగంలోనూ ఉపాధి మెరుగు
సైబర్‌ సెక్యూరిటీ రంగంలోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు రానున్నాయని తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని ఐటీ - ఐటీస్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సీఈఓ అమిత్ అగర్వాల్ వివరించారు. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన నాస్కామ్‌ హెచ్‌ఆర్‌ సదస్సు వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పరిశ్రమలో ఏడాది చివరి నాటికి దాదాపు 40 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని తాము భావిస్తున్నామని అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ఆటోమేషన్‌ ప్రక్రియ, వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రయత్నాలు దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 

ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్ ఫామ్ స్థాయిలో ఇండియన్ టాలెంట్ హబ్
భారతదేశంలో అభివ్రుద్ధి చెందుతున్న టెక్నాలజీలు.. క్రుత్రిమ మేధస్సు, బిగ్ డేటా అనలటిక్స్ వంటి అంశాలతో టాలెంట్ హబ్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నాస్కామ్ ‘పైలట్ రీ స్కిల్లింగ్ ఇన్సియేటివ్ ప్లాట్ ఫామ్ ‘ఫ్యూచర్ స్కిల్స్’ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తొమ్మిది రకాల టెక్నాలజీలను గుర్తించిన నాస్కామ్.. ఆయా రంగాల్లో 66 జాబ్ రోల్స్, 155 రకాల స్కిల్స్ ను నిర్ధారించింది. 

నూతన ఉద్యోగావకాశాలు కల్పించే సెక్టార్లు ఇవి
బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, సోషల్ అండ్ మీడియా, విర్చువల్ రియాల్టీ, 3డీ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. తొలిదశలో విప్రో, టెక్ మహీంద్రాలతోపాటు నాస్కామ్ సభ్య సంస్థలు సియంట్, జెన్ పాక్ట్ అండ్ డబ్ల్యూఎన్ఎస్, సీజీఐ (గ్లోబల్ కాపబిలిటీ సెంటర్), పర్పుల్ టాక్ (ఉత్పత్తులు), డేవ్ - ఐటీ అండ్ కెల్టోన్ (ఎస్ఎంఈస్) ఈ సెక్టార్లలో శిక్షణపై కేంద్రీకరిస్తాయి. తదుపరి దశలో యూనివర్శిటీలు, కాలేజీలను చేరుస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios