భారతదేశంలో ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థలలో ఏషియన్  పెయింట్స్  ఒకటి. దేశానికి సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుంది అయితే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల మధ్య సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ ముందంజలో ఉంది, ఇందుకోసం పి‌ఎం కేర్స్ ఫండ్‌కు సహకరంగా ఒక కొత్త జాతీయ గీతానికి  ముఖ్య స్పాన్సర్‌లలో ఒకరిగా నిలిచింది.

ఈ కొత్త జాతీయ గీతాన్ని  కరోనా యోధులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. జయతు జయతు భారతం, వాసుదేవ్ కుటుంబక్కం అనే ఈ గీతన్ని మే 17 ఆదివారం రోజున లాంచ్ చేశారు. ఈ పాట కోసం  ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ఇస్రా) నుండి 200 మంది గాయకులు రికార్డ్ బ్రేక్ చేస్తూ ఒకే వేదికపై కలిసి ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఇంతమంది కలిసి ఒకే వేదికలో పాల్గొనడం ఇదే మొట్టమొదటిసారి.


కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఐక్యతను చాటెందుకు సోను నిగమ్,శ్రీనివాస్, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ఇస్రా) సిఇఒ సంజయ్ టాండన్ చేసిన గొప్ప ఆలోచన ఇది. లాక్ డౌన్, సామాజిక దూరం పాటిస్తూ  ప్రతి ఒక్క సింగర్ పాటలోని తమ వంతు భాగాన్ని వారి ఇంటి నుండే రికార్డ్ చేయడంతో ఈ పాట మరింత ప్రత్యేకంగా నిలిచింది.

 చాలా మంది పాట పాడే ఆర్టిస్టులకు చాలా సవాళ్లు ఉంటాయి  ఏంటంటే పాట రికార్డింగ్ సమయంలో ప్రొఫెషనల్ రికార్డింగ్ డివైజెస్ వంటివి లేక పోవడం అయిన అలాంటి సమస్యలను అధిగమిస్తు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆర్టిస్టులు ఒక పాట కోసం కలిసి రావడం గొప్ప విశేషం. మొత్తం 14 వేర్వేరు భాషలలో ఈ పాటను పాడారు.

ఆశా భోంస్లే, అనుప్ జలోటా, ఆల్కా యాగ్నిక్, హరిహరన్, కైలాష్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను, మహాలక్ష్మి అయ్యర్, మనో, పంకజ్ ఉధాస్, ఎస్. పి. బాలసుబ్రమణియన్, షాన్, సోను నిగం, సుదేశ్ భోస్లే, సురేష్ వాడ్కర్, శైలేంద్ర సింగ్, శ్రీనివాస్, తలాత్ అజీజ్, ఉడిట్ నారాయణ్, శంకర్ మహాదేవన్, జస్బీర్ జాస్సీ ఇంకా మరో 80 మంది గాయకులు, ఆర్టిస్టులు ఈ పాటలో భాగంగా ఉన్నారు.

also read క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రతలు గుర్తుంచుకోండి...

ఈ పాటకు ముఖ్య స్పాన్సర్ ఏషియన్ పెయింట్స్ పాత్ర గురించి ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండి, సిఇఒ అమిత్ సింగిల్ మాట్లాడుతూ “ఏషియన్ పెయింట్స్ ఎల్లప్పుడూ ఒక బాధ్యతాయుతమైన బ్రాండ్. ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న భారతదేశం ఒక గొప్ప సవాల్ ఎదురుకొంటుంది.

ఇలాంటి సమయంలో ముందడుగు వేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు.  దాదాపు 200 మంది ఆర్టిస్టులు వారి సొంత  ఇంటి నుండి తమ వంతు గొంతు కలుపుతూ పాటకు శక్తినివ్వడం మాకు గర్వకారణం. మన దేశంలో అత్యంత ప్రశంసలు పొందిన కళాకారులు ఈ పాటలో భాగంగా ఉన్నారు. భారతీయ బ్రాండ్‌గా మేము ఎంతో గర్వంగా ఉన్నాము,
వన్ నేషన్ వన్ వాయిస్ అనేది కేవలం ఒక పాట మాత్రమే కాదు ఇది ప్రజల ప్రస్తుత భావోద్వేగాలను ప్రతిబింబించే ఉద్యమం.

మాకు తెలుసు కరోనా వైరస్ సంక్షోభం నుండి దేశం బయటపడటానికి ఇది స్ఫూర్తినిస్తుంది, తీసుకువస్తుంది. ” అని అన్నారు. పి‌ఎం కేర్స్ ఫండ్ కు, వివిధ రాష్ట్రాలలోని సిఎంలకు కరోనా వైరస్ తో పోరాడటానికి ఏషియన్ పెయింట్స్ ఇప్పటికే 35 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పాట మే 17న 100కి పైగా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైంది.

టీవీ, రేడియో, సోషల్ మీడియా, అప్లికేషన్స్,  ఓ‌టి‌టి , వి‌ఓ‌డి, ఐ‌ఎస్‌పి, డి‌టి‌హెచ్, సి‌ఆర్‌బి‌టి ఇలా 100 కు పైగా ఉన్నాయ. బ్రాడ్ కాస్ట్,  సోషల్ ఆంప్లిఫికేషన్, టెక్ వేదికలు ఈ పాట లాంచ్ చేయడానికి సహకరించాయి. ఈ పాట లాంచ్ పై వచ్చిన మొత్తం ఆదాయం . కోవిడ్ -19(కరోనా వైరస్) కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పి‌ఎం కేర్స్ ఫండ్‌కు వెళ్తుంది. ఈ పాట 14 భాషలలో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, అస్సామీ, కాశ్మీరీ, సింధి, రాజస్థానీ ఇంకా ఒడియా భాషలలో విడుదలైంది.