Asianet News TeluguAsianet News Telugu

Are you using a credit card..?: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు వివిధ సేవలకు ఛార్జీలను పెంచాయి. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎంత ఛార్జ్‌ చేస్తున్నాయో తెలుసుకుందాం. 

Are you using a credit card..?
Author
Hyderabad, First Published Jan 15, 2022, 3:49 PM IST

ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు వివిధ సేవలకు ఛార్జీలను పెంచాయి. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎంత ఛార్జ్‌ చేస్తున్నాయో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే షాపింగ్ బిల్లును చెల్లించడానికి మీకు 50 రోజుల వడ్డీ రహిత వ్యవధి లభిస్తుంది. అయితే గడువు తేదీ తర్వాత చెల్లిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆలస్య చెల్లింపు రుసుము అంటారు. ఆలస్య చెల్లింపు రుసుమును ఆయా బ్యాంకులు విధిస్తాయి.

మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 500 కంటే తక్కువ చెల్లించాల్సిన మొత్తానికి ఆలస్య రుసుము ఉండదు. 501-1000 రూపాయలకు ఆలస్య చెల్లింపు రుసుము 400 రూపాయలు, 1001-10 వేల రూపాయలు ఉంటే 1300 రూపాయల వరకు ఉంటుంది. నగదు ఉపసంహరణపై ఈ ఛార్జీ కనీసం రూ. 500 లేదా ఉపసంహరించుకున్న మొత్తంలో 2.5%, ఏది ఎక్కువ అయితే అది విధిస్తుంది. ఓవర్‌లిమిట్ ఛార్జీ 2.5 శాతం, గరిష్టంగా రూ.600 ఉంటుంది. చెక్ రిటర్న్ ఫీజు రూ.500 వరకు ఉంటుంది.

ఆలస్య చెల్లింపు రుసుము, ముందస్తు నగదు లావాదేవీల రుసుము, చెక్ రిటర్న్ రుసుము, ఆటో డెబిట్ రిటర్న్ రుసుములను పెంచాలని బ్యాంక్ నిర్ణయించింది. కొత్త ఛార్జీ 10 ఫిబ్రవరి 2022 నుంచి వర్తిస్తుంది. అయితే ఎమరాల్డ్ క్రెడిట్ కార్డుపై ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది కాకుండా బకాయి మొత్తం రూ.100 కంటే తక్కువగా ఉంటే ఛార్జీలు వర్తించవు. రూ.100-500 మధ్య బకాయి ఉంటే రూ.100, రూ.501-5000 వరకు బ్యాలెన్స్ ఉంటే రూ.500, రూ.5001-10000 వరకు బకాయి ఉంటే రూ.750, రూ.10001-25 వేల వరకు బకాయి ఉంటే రూ.900, 25001 రూ.50 వేల నుంచి రూ.1000 వరకు, రూ.50 వేల కంటే ఎక్కువ బకాయి ఉన్నట్లయితే, రూ.1200 ఆలస్య చెల్లింపు ఛార్జీగా వసూలు చేస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.300 వరకు బ్యాలెన్స్‌పై ఎటువంటి ఛార్జీ ఉండదు. ఆలస్య చెల్లింపు రుసుము రూ.300-500 బకాయిలపై రూ.100, రూ.501-1000 బకాయిలపై రూ.500, రూ.1001-10000 వరకు బకాయిలకు రూ.1000 ఆలస్య చెల్లింపు రుసుము చెల్లించాలి. నగదు ఉపసంహరణ కోసం మొత్తం ఉపసంహరణ మొత్తంలో 2.5% ఛార్జ్ చేస్తారు. ఇది కనిష్టంగా రూ.500 అవుతుంది.

HDFC క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.100 కంటే తక్కువ చెల్లింపుపై ఛార్జీ ఉండదు. రూ.100-500 వరకు రూ.100, రూ.501-5000 వరకు రూ.500, రూ.5001-10000 వరకు రూ.600, రూ.10001-25000 వరకు రూ.800, రూ.25001-50000 రూ. 1100, 50 వేల కంటే ఎక్కువ బకాయిలు ఉంటే రూ.1300. చెల్లించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios