ప్రీమియం సెగ్మెంట్లో ‘ఐఫోన్’దే హవా!
శామ్‍సంగ్‌తోపాటు పలు చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించినా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఆపిల్ ఐఫోన్లదే అగ్రాసనం. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ ఐఫోన్లు .. భారతదేశ ప్రీమియం మార్కెట్లో అగ్రస్థానాన్ని అలంకరించాయని ఐడీసీ తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆపిల్, దాని అనుబంధ ఐఫోన్లు ఇతర ఉత్పత్తుల గురించి వినియోగదారులకు యమ క్రేజీ ఉంటుంది. టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి రానున్నదన్న వార్త వస్తే చాలు.. క్యూలైన్లలో నిలుచుని మరీ సదరు ఉత్పత్తిని తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ‘ఆపిల్’ ప్రియులు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ల ప్రీమియం సెగ్మెంట్ (రూ.35 వేల పై చిలుకు)లో 51.3 వాటా కొట్టేసిన ఆపిల్ అగ్రశ్రేణిగా నిలిచింది. ఈ సెగ్మెంట్లో అత్యధిక వాటాతో ఆపిల్ ‘ఐఫోన్’ మొదటి స్థానంలో నిలవడం ఇది రెండవ సారి అని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
aslo read హువావే బంపర్ ఆఫర్ : ఉద్యోగులకు డబుల్ ధమాకా
శామ్ సంగ్, వన్ ప్లస్ తదితర సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించినా.. ప్రమోషనల్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చినా ఆపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ దూకుడును అడ్డుకోలేకపోయాయి.
‘స్మార్ట్ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో ఆపిల్ ‘ఐఫోన్’ 51.3 శాతం మార్కెట్ వాటా పొందింది. ప్రమోషనల్ ఆపర్లు, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 8, ఐఫోన్ 7 (128 జీబీ), కొత్తగా విపణిలోకి విడుదల చేసిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడల్ ఫోన్లపై ధరలు తగ్గడం వల్లే ఇది సాధ్య పడింది’ అని ఐడీసీ తెలిపింది.
ఈ ఏడాది జూన్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో 41.2 శాతం వాటాతో ఆపిల్ ‘ఐఫోన్’ కేవలం మూడు నెలల్లోనే 10 శాతం వ్రుద్ధిని నమోదు చేసి మూడో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.
ఇక ఆపిల్ ఐఫోన్ కూడా తాజాగా ఆఫర్ల యుద్దంలో అడుగు పెట్టేసింది. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌తోపాటు ఐఫోన్ 8, ఐఫోన్ 7, నూతనంగా ఆవిష్కరించిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో మోడల్ ఫోన్లపై ఆఫార్డబిలిటీ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చిందని ఐడీసీ వివరించింది.
also read అమెజాన్ బంపర్ ఆఫర్ :20వేల విలువైన ఫోన్ 10వేలకే...
ఐడీసీ ఇండియా క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి మాట్లాడుతూ 750 -850 డాలర్ల పరిధిలోని ఆపిల్ ఐఫోన్లకు స్వీట్ స్పాట్ అని అభిప్రాయ పడ్డారు. 1000 డాలర్ల పై చిలుకు ధర గల ఫోన్లను ఇప్పటికీ భారతీయులు అందుకోలేకపోతున్నాని తెలిపారు.
భారతదేశంలో ప్రైస్ కాన్సియస్ చాలా ఎక్కువ. కనుక 700 పై చిలుకు డాలర్ల ధర గల ఐఫోన్లపై వచ్చే పండుగల సీజన్లలో ఆకర్షణీయంగా భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు, అట్రాక్టివ్ ఆఫర్లు అందజేయాలని సూచించారు.