Asianet News TeluguAsianet News Telugu

Apple కంపెనీ కీలక బాధ్యతలు చేపట్టేది భారతీయ మూలాలున్నవ్యక్తి.. ఆయన ఎవరంటే..

ప్రపంచంలో టెక్నాలజీలో టాప్‌లో ఉన్న యాపిల్‌ కంపెనీ భారత దేశ మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించబోతోంది. ఇది జరిగితే ప్రపంచంలో టాప్‌ 10 కంపెనీల్లో ప్రధాన బాధ్యతలు చేపడుతున్న వారి జాజితాలో ఆయన కూడా చేరిపోతారు. మరి యాపిల్‌ కంపెనీకి బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన ఎవరు. ఎక్కడుంటారు. తదితర విషయాలు తెలుసుకుందాం..
 

Apple to Appoint Indian-Origin Executive Kevan Parekh as New CFO sns
Author
First Published Aug 27, 2024, 6:53 PM IST | Last Updated Aug 27, 2024, 6:53 PM IST

యాపిల్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌, సెల్ ఫోన్‌ రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా ఈ కంపెనీ అందించే సేవలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రపంచంలో అత్యధిక ఆదాయం సంపాదించే కంపెనీల్లో యాపిల్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇంత పెద్ద పేరున్న యాపిక్‌ కంపెనీ తదుపరి సీఎఫ్‌ఓ(ఛీప్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌)గా భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ వచ్చే ఏడాది జనవరి 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.

యాపిల్‌ కంపెనీ ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) లూకా మేస్త్రి తప్పుకున్న తర్వాత పరేఖ్ ఆ సీట్లో కూర్చోనున్నారని Apple ప్రతినిధులు ప్రకటించారు. కేవన్ పరేఖ్ గత 11 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్, G&A, బెనిఫిట్స్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్, మార్కెట్ రీసెర్చ్‌లో వర్క్‌ చేస్తున్నారు. ఆపిల్ ఫైనాన్స్ టీమ్‌లో కెవెన్ పరేఖ్ చాలా కీలక వ్యక్తి. ఆయన టాలెంట్‌, ఆర్థిక నైపుణ్యాన్ని గుర్తించిన ఆపిల్ తదుపరి CFO అని ఆపిల్ CEO టిమ్ కుక్ తెలిపారు.
 
కెవెన్ పరేఖ్ ప్రస్థానం ఇది..
కెవాన్ పరేఖ్ మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. చికాగో విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా కూడా పొందారు. కెవెన్ పరేఖ్ గతంలో థామ్సన్ రాయిటర్స్‌లో పనిచేశారు. జనరల్ మోటార్స్‌లో కూడా పనిచేశారు. ఆయనొక ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆ తర్వాత 2013లో యాపిల్‌లో ఫైనాన్స్, ప్రొడక్ట్ మార్కెటింగ్‌లో చేరారు. 

లూకా మేస్త్రి విశ్వాసం..
 లూకా మేస్త్రి 2014లో యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అతని పదవీకాలంలో సంస్థ వార్షిక అమ్మకాలు, నికర ఆదాయాన్ని రెట్టింపు చేసింది. సాంకేతికత, సమాచార భద్రత, రియల్ ఎస్టేట్, అభివృద్ధితో సహా కార్పొరేట్ సేవల బృందాలకు లూకా నాయకత్వం వహించారు. కెవెన్ పరేఖ్ పనితీరు, బాధ్యతల నిర్వహణపై చాలా ధీమా వ్యక్తం చేశారు. కెవెన్ చాాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి అని, సీఎఫ్ఓ స్థానానికి సరైన పర్సన్ అని విశ్వాసం వ్యక్తం చేశారు. 

యాపిల్ లోకి మరికొంత మంది..
Apple ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్‌లో చాలా మంది 60 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వారు దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో భవిష్యత్తులో ఆపిల్ నాయకత్వంలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios