Asianet News TeluguAsianet News Telugu

రూ. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు ఎంతమంది తెలుసా...

ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి ఆధారంగా ప్రొఫెషనల్ టాక్స్ చెల్లిస్తున్న వ్రుత్తి నిపుణులు 2,200 మంది మాత్రమేనని ఐటీ శాఖ తెలిపింది. వీరంతా రూ. కోటికి పైగా ఆదాయం సంపాదిస్తున్న వారేనని వెల్లడించింది. 

income tax debts backup pm modis professional tax return claim
Author
Hyderabad, First Published Feb 15, 2020, 10:57 AM IST

న్యూఢిల్లీ: రూ.కోటి కంటే అధిక ఆదాయం పొందుతున్న డాక్టర్లు, సీఏలు, వ్రుత్తి నిపుణులు కేవలం 2,200 మంది మాత్రమేనని ఆదాయం పన్నుశాఖ పేర్కొంది. ఆదాయం పన్ను చెల్లింపులపై ఐటీ శాఖ చాలా కీలక విషయాలను ట్వీట్ల రూపంలో వెల్లడించింది. 
గత ఆర్థిక సంవత్సరం 2018-19 ఆదాయం పన్ను వివరాలను కూడా ఐటీ శాఖ ప్రకటించింది.

also read 'ప్లీజ్, మీ డబ్బు తీసుకోండి': విజయ్ మాల్యా

‘‘ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్‌ను ఫైల్‌ చేసిన వ్యక్తుల్లో కేవలం 2,200 మంది డాక్టర్లు, లాయర్లు, సీఏలు వంటి వృత్తి నిపుణుల ఆదాయం మాత్రమే రూ.కోటి దాటింది. ఇది కేవలం వారి ప్రధాన ఆదాయం మాత్రమే.. ఇతర మార్గాల నుంచి ఆదాయాన్ని దీనిలో కలపలేదు’’ అని తెలిపింది.

income tax debts backup pm modis professional tax return claim

ప్రజలు దేశాభివృద్ధి కోసం పన్నులు చెల్లించాలని బుధవారం ప్రధాన మంత్రి కోరిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో పన్నులు ఎగవేయడంతో నిజాయతీగా పన్ను చెల్లంచే వారిపైనే అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ పన్ను చెల్లించే వారి సంఖ్యను ట్విటర్‌లో వెల్లడించింది. 

also read ఇండియాలో పర్యటించనున్న మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్యా నాదేళ్ళ

‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్‌ చేశారు.  వీరిలో 1.03 కోట్ల మంది వ్యక్తిగత ఆదాయం రూ.2.5లక్షలు కాగా, 3.29 కోట్ల మంది ఆదాయం రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలు చూపారు. వీరిలో రూ.5లక్షల లోపు ఆదాయం చూపిన 4.32 కోట్ల మంది ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక 1.46 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంది’ అని ఐటీ శాఖ వివరించింది.

‘వీరిలో కోటి మంది ఆదాయం రూ.10 లక్షల లోపు,  46 లక్షల మంది ఆదాయం రూ.10 లక్షలకు పైగా..ఉంది. 3.16 లక్షల మంది మాత్రమే రూ.50లక్షల పైన ఆదాయం పొందుతున్నారు. వీరిలో 8,600 మంది 5కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. వీరిలో 2,200 మంది డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏలు వంటి వృత్తి నిపుణులు ఉన్నారు’ అని  వరుస ట్వీట్లలో ఐటీ శాఖ వివరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios