ఐఫోన్ సేల్స్ తగ్గిపోవడంతో: తగ్గిన ఆపిల్ సీఈఓ వేతనం

ఏయేటికాయేడు ప్రతిభా ఆధారంగా వేతనాలు చెల్లించే టెక్ సంస్థ ఆపిల్. 2019లో ఐఫోన్స్ సేల్స్ తగ్గిపోవడంతో ఆయన వేతనాన్ని కూడా సంస్థ కాసింత తగ్గించేసింది. 2018తో పోలిస్తే గతేడాది 4.1 మిలియన్ల డాలర్ల వేతనం తగ్గిందన్నమాట.

Apple CEO Tim Cook's total salary dropped last year after poor iPhone sales in 2019

శాన్‌ ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వార్షిక వేతనం గతేడాది కాస్త తగ్గింది. 2018లో కుక్‌ 15.7 మిలియన్‌ డాలర్ల వేతనం తీసుకోగా 2019 సంవత్సరానికి 11.6 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకున్నారు. 2018తో పోలిస్తే గతేడాది యాపిల్ పర్‌ఫార్మెన్స్‌ తగ్గడంతో టిమ్‌ కుక్‌ వేతనంలో కోత పడింది. 

also read  తక్కువ బడ్జెట్ లో దొరికే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

గతేడాదికి టిమ్‌ కుక్‌ 3 మిలియన్‌ డాలర్ల మూలవేతనం అందుకోగా 7.7 మిలియన్‌ డాలర్లు ప్రోత్సాహక బోనస్‌ కింద తీసుకున్నారు. ఆపిల్‌ పనితీరుపై ఆధారపడి ఈ బోనస్‌ ఇస్తుంటారు. 2018లో కంపెనీ విక్రయాలు అనుకున్న లక్ష్యానికంటే రెట్టింపవడంతో టిమ్‌ కుక్‌ 12 మిలియన్‌ డాలర్లు బోనస్‌ రూపంలో అందుకున్నారు. 

Apple CEO Tim Cook's total salary dropped last year after poor iPhone sales in 2019

గతేడాది ఈ విక్రయాలు 28శాతం మాత్రమే పెరగడంతో సీఈవో బోనస్‌ను తగ్గించారు. ఇక సెక్యూరిటీ, ఇతర ప్రయోజనాల కింద మరో 8,85,000 డాలర్లను కుక్‌ అందుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కుక్‌ తన వ్యాపార, వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్  విమానాన్ని ఉపయోగిస్తారు. ఆ ఖర్చును కంపెనీయే భరిస్తుంది.

also read మార్కెట్లోకి కొత్త ఔట్ డోర్ స్పీకర్...అతి తక్కువ ధరకే...

2019లో ఐఫోన్‌ విక్రయాలు కాస్త తగ్గాయి. గతేడాది యాపిల్‌ 260.2 బిలియన్‌ డాలర్ల మేర నికర విక్రయాలు జరపగా.. 63.9 బిలియన్‌ డాలర్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించినట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఫైలింగ్‌‌లో కంపెనీ వెల్లడించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios