Asianet News TeluguAsianet News Telugu

తక్కువ బడ్జెట్ లో దొరికే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

 ప్రస్తుత మార్కెట్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే రూ.30వేలకు పైగా ఖర్చు చేయాలి.  కానీ టెక్ నిపుణులు మాత్రం మీ దగ్గర పదివేలు ఉంటే చాలు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయోచ్చని అంటున్నారు. 

best smart phones to buy under  budget in 2019
Author
Hyderabad, First Published Jan 4, 2020, 10:39 AM IST

చాలా మందికి లేటెస్ట్ కొత్త మొబైల్ తీసుకోవాలని అనుకుంటుంటారు. కానీ ప్రస్తుత మార్కెట్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే రూ.30వేలకు పైగా ఖర్చు చేయాలి.  కానీ టెక్ నిపుణులు మాత్రం మీ దగ్గర పదివేలు ఉంటే చాలు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయోచ్చని అంటున్నారు. 

అంతేకాదు  2020 జనవరి నెలలో రూ.10వేలలో వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవేనని కూడా అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ స్మార్ట్ ఫోన్లేంటి..? వాటి ప్రైస్ ఎలా ఉన్నాయ్, వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా...?

రెడ్ మీ నోట్ 7 ప్రో-  తక్కువ ధరతో అనుకున్న బడ్జెట్ లో దొరికే ఫోన్ లో షియోమీ సంస్థ నుంచి విడుదలైన స్మార్ట్ ఫోన్లు తొలిస్థానంలో ఉన్నాయి. వాటిలో రెడ్ మీ నోట్ 7 ప్రో తొలిస్థానంలో ఉంది.  

also read  కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా

 ప్రత్యేకతలు - బిల్డ్ క్వాలిటీ, గ్లాస్ ప్రొటెక్షన్, ఫోన్ చుట్టూ ఫోలిక్ ఆర్బిట్ ఫ్రేమ్,  ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5, గ్లాస్ బ్యాక్ ఫోన్  ను తయారు చేసింది. మిగిలిన శాంసంగ్, మ్యాక్స్ ప్రో ఎంటూ లా గ్లాస్ ఫినిష్ ఫోన్ ల కంటే..గ్లాస్ బ్యాక్ ఫోన్ సౌకర్యం కలిగి ఉండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రెడ్ మీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపించారు.

 కలర్స్ - బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ తో మహిళలతో పాటు అన్నీ వర్గాల ప్రజలు వినియోగించేలా కలర్స్ డిజైన్ చేయడంతో అమ్మకాల విషయంలో రెడ్ మీ టెక్ మార్కెట్ లో సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. 

అందుకే ఫోన్ విడుదల సందర్భంగా ఈ ఫోన్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా  15మిలియన్ షిప్ మెంట్  మైలు రాయిని చేరుకోవడంతో ఓపెన్ సేల్ కు పంపిస్తున్నట్లు షియోమీ కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ ప్రకటించారు. నాటి ఫోన్ ప్రైస్ ధర 14వేలు ఉండగా..ఇప్పుడు 10వేలకే మార్కెట్లో లభ్యమవుతుంది.  

రెడ్ మీ నోట్ 7 ప్రో ఫీచర్స్ -  ఎల్టీపీఎస్ డిస్ ప్లే,డిస్ ప్లే పైన నాచ్,టెంపరేచర్ 44 నుంచి 45 వరకు రీచ్ అవుతుంది.స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌సెట్‌,  ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,  డ్యూయల్ కెమెరా సెటప్,  48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలంటే రూ.10వేలకే మార్కెట్లో లభ్యమవుతుంది.

రెడ్ మీ నోట్ 8

 షియోమి తన సంస్థ నుంచి ఒకేసారి  రెడ్‌మి 8A, రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.   ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత వాటి హవా ఇంకా ముగియక ముందే ఇప్పుడు మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లలో రెడ్ మీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తోంది.

ఫీచర్స్ - 48ఎంపీ క్వాడ్ కెమెరా, ఆల్ట్రా వైడ్ అండ్ మైక్రో లెన్స్, డ్యూయల్ కార్నింగ్, గొరిల్లా గ్లాస్, 4000mah బ్యాటరీ, 18 ఫాస్ట్ ఛార్జర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665, 6జీబీ ర్యామ్, 128జీబీ,13ఎంపీ హై రెజెల్యూషన్ సెల్ఫీ కెమెరా, పనోరమ సెల్ ఫైల్స్, ప్లామ్ షట్టర్ క్యాప్చర్, 16 సెంటీమీటర్ల పొడవుతో ఫుల్ హై డెఫినేషన్ సెల్ ఫ్రూఫ్ డిజైన్ మరియు బ్రైట్ నెస్, పీ2ఐ కంపెనీ ఉత్పత్తి చేసే స్ల్పాష్ ఫ్రూఫ్ డిజైన్, ఆడియో ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

ఈ ఫోన్ లో నాలుగు కెమెరాలు ఉండగా వాటిలో ఒక కెమెరాలో ఆల్ట్రా వైడ్ యాంగిల్, రెండో కెమెరాలో 48ఎంపీ ప్రైమరీ, మూడో కెమెరాలో డెప్త్ సెన్సార్, నాలుగో కెమెరాలో మ్యాక్రో లెన్స్ లతో ఆకట్టుకుంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం 30

దక్షిణ కొరియా కు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏం30 రూ.10వేలకే మార్కెట్లో దొరుకుతుంది. 2019మార్చ్ లో విడుదలైన ఈ ఫోన్ లో అన్నీ ఫీచర్స్ ఉన్నాయి. కాస్ట్ కు తగ్గట్లు ఫోన్ ను డిజైన్ చేయడంతో పాటు ఫీచర్స్ గాడ్జెట్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. వాటిలో ఫీచర్స్ విషయానికొస్తే

also read మార్కెట్లోకి కొత్త ఔట్ డోర్ స్పీకర్...అతి తక్కువ ధరకే...

డిజైన్ – ఈ ఫోన్ ను పై నుంచి కింద వరకు ఇన్ ఫినిటి యూ డిస్ ప్లే పేరుతో నాచ్ డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ తో పాటు రెండు నానో సిమ్ ఒకటి మెమోరీ కార్డ్ లతో డిజైన్ చేసిన స్లాట్ సౌలభ్యంగా ఉంది.

డిస్ ప్లే  - 6.4 ఇంచస్ తో బెజెల్ లెస్ సూపర్ అల్మోడ్ డిస్ ప్లే, 2080*1080పిక్సల్ రెజెల్యూషన్, పీపీఐ- 394 (పిక్సెల్ పర్ ఇంచ్ ), వాటర్ డ్రాప్ట్ నాచ్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్, ఆకర్షణీయంగా, అందమైన అనుభూతిని కలిగించడంతో పాటు159 x 75.1 x 8.5 మిమీ, 174 గ్రాముల బరువుతో సింపుల్ గా ఉంటుంది. 

బ్యాటరీ సామర్ధ్యం  - బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఈ ఫీచర్ సాధారణంగా అన్నీ ఫోన్లకు ఉండవు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 25 యూట్యూబ్ వీడియోలు, 30గంటల పాటు ఫోన్ మాట్లాడొచ్చు.

కెమెరా  - ఆప్టిక్స్ విషయానికొస్తే వెనుక భాగంలో  13MP + 5MP + 5MP  ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. పోర్ట్రెయిట్ల అద్భుతమైన వైడ్ యాంగిల్  స్నాప్‌షాట్‌ను తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. వెనుక కెమెరా సెటప్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్, ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ లు ఉన్నాయి.  గెలాక్సీ M30 లో 16MP ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్ ఉంది. ఫోన్‌లో డిజిటల్ జూమింగ్ టెక్నాలజీ ఉంది. ఇది చిన్న అక్షరాలుసైతం కనిపించేలా చేస్తుంది.

 ప్రాసెసర్-  ఆక్టా కోర్ 1.8GHz,  ఎక్సినోస్ 7904 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.  4GB RAM   మాలి జి 71 ఎంపి, 2 జిపియు , గ్రాఫిక్ కార్డ్, కనెక్టివిటీ 3జి, 4జి-వోల్టిఇ, బ్లూటూత్, వైఫై, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్‌బి టైప్-సి మరియు మొబైల్ హాట్‌స్పాట్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.  లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్ ,  గైరోస్కోప్ వంటి ఇతర సెన్సార్లతో వస్తుంది. ఇది లాగ్ లేకుండా అద్భుతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రోయిడ్ ఓ‌ఎస్ లో నడుస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios