Asianet News TeluguAsianet News Telugu

పతంజలిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: చర్యలు తీసుకోవాలంటూ బాబా రామ్‌దేవ్..

ఆయుర్వేదం, సహజ ఉత్పత్తులపై అపోహలు ప్రచారం చేస్తూ పతంజలి ప్రతిష్టను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాబా రామ్‌దేవ్ అన్నారు. బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలికి వ్యతిరేకంగా కార్పొరేట్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, మేధావులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Anti-ayurveda mafia trying to destroy Patanjali'; Baba Ramdev called the action against nationalism-sak
Author
First Published Jul 5, 2024, 10:53 AM IST | Last Updated Jul 5, 2024, 10:53 AM IST

ఢిల్లీ : పతంజలిని నాశనం చేసేందుకు ఆయుర్వేద వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారని ఆయుర్వేద యోగా గురువు రామ్‌దేవ్ అన్నారు. బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలికి వ్యతిరేకంగా కార్పొరేట్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, మేధావులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఇలాంటి గ్రూపులు పతంజలి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. బాబా రామ్‌దేవ్ పతంజలి పరిశోధన & అభివృద్ధి సౌకర్యాలపై అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. భారతదేశంలోని అతిపెద్ద వినియోగ వస్తువుల కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంటే పతంజలి మెరుగైనదని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.

‘‘ఆయుర్వేదం, సహజ ఉత్పత్తులపై అపోహలు ప్రచారం చేస్తూ పతంజలి ప్రతిష్టను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మేము పెట్టుబడిదారుల విలువను, డిస్ట్రిబ్యూషన్, అమ్మకాలు పెంచడం, రీసర్చ్, ఆవిష్కరణలు,  అలాగే ఇ-కామర్స్‌పై దృష్టి సారించాం’’ అని బాబా రామ్‌దేవ్ చెప్పారు.హెర్బల్ టూత్‌పేస్ట్ మార్కెట్‌లో పతంజలికి మూడింట రెండు వంతుల వాటా ఉందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ అస్థానా గతంలో ప్రకటించారు. గత ఏడాది రూ.1,600 కోట్ల బిస్కెట్ విక్రయాలతో దేశంలో నాలుగో అతిపెద్ద బిస్కెట్ మార్కెట్‌గానూ నిలిచిందని ప్రకటనల్లో తెలిపారు. అయితే, ఈ ప్రకటనలపై సుప్రీం కోర్టు కొన్ని నెలల క్రితం అభ్యంతరం తెలిపింది. తప్పుదోవ పట్టించే అన్ని ప్రకటనలను ఉపసంహరించుకోవాలని పతంజలిని ఆదేశించింది. ఆ తర్వాత పతంజలి ప్రకటనలను మార్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios