న్యూ ఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర బ్యాంకుల నుండి  400 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకున్న ఢీల్లీకి చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారు రామ్ దేవ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యజమానులు రుణాలు చెల్లించకుండ దేశం నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు బ్యాంకుల నుంచి వాళ్లు రుణం తీసుకుని 2016 నుంచి డిఫాల్ట‌ర్లు మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు తేలింది.  

నాలుగు సంవత్సరాల తరువాత, ఫిబ్రవరి 25న ఎస్‌బి‌ఐ నుండి ఫిర్యాదు పొందిన తరువాత, సిబిఐ గత వారం, ఏప్రిల్ 28న వారిపై కేసు నమోదు చేసింది.రామ్‌దేవ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ సుమారు 411 కోట్లు రుణం తీసుకున్న‌ది. దాంట్లో 173.11 కోట్లు ఎస్బీఐ నుంచి,  76.09 కోట్ల కెన‌రా బ్యాంకు నుంచి, 64.31 కోట్లు యునియ‌న్ బ్యాంక్ నుంచి, 51.31 కోట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, 36.91 కోట్లు కార్పొరేష‌న్ బ్యాంకు నుంచి, 12.27 కోట్లు ఐడీబీఐ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఎస్‌బి‌ఐ ఫిర్యాదు చేసిన తరువాత, సిబిఐ సంస్థ రామ్‌దేవ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ డైరెక్టర్లు నరేష్ కుమార్, సురేష్ కుమార్, సంగిత, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. వారిపై ఫోర్జరీ, అవినీతి వంటి పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

also read తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలీ లేదంటే..: సీఐఐ

ఎస్‌బి‌ఐ సిబిఐకి చేసిన ఫిర్యాదు కాపీని ఎన్‌డి‌టి‌వి యాక్సెస్ చేసింది. తనిఖీ సమయంలో రుణగ్రహీతలు అందుబాటులో లేరు దీంతో హర్యానా పోలీస్ సెక్యూరిటీ విచారణలో రుణగ్రహీతలు పరారీలో ఉన్నారని, దేశం విడిచి వెళ్ళారని ఫిర్యాదులో పేర్కొంది.

 రామ్ దేవ్ ఇంటర్నేషనల్ కంపెనీ ముగ్గురు డైరెక్టర్లకు ట్రిబ్యునల్  మే 2018 నుండి మూడుసార్లు వారెంట్లు జారీ చేసింది తరువాత నిందితులు దుబాయ్‌కు పారిపోయారని, అందుబాటులో లేరని 2018 డిసెంబర్‌లో ట్రిబ్యునల్‌కు సమాచారం అందింది.

దర్యాప్తులో పాల్గొన్న అధికారులు ఎన్డిటివితో మాట్లాడుతూ ఎస్‌బి‌ఐ  చివరకు సిబిఐని సంప్రదించింది, నిందితులు దేశం నుండి పారిపోయే ముందు, వారి ఆస్తులను చాలా వరకు విక్రయించింది దీంతో దాని బకాయి మొత్తాన్ని తిరిగి పొందడం అస్పష్టంగా ఉందని తెలిపింది.