ఇప్పుడు ఈ జెనరేషన్లో మనకు రూపాయి అందుబాటులో ఉంది కానీ రూపాయికి ముందు ఆటన(50 పైసలు), చారణ (25 పైసలు), ఇరవై పైసలు (20 పైసలు), 10 పైసలు ఉండేవి. అయితే కాలం మారుతున్న కొద్ది ప్రభుత్వం ఈ పైస నాణెంలను నిలిపివేసి రూపాయిని అందుబాటులోకి తెచ్చింది.

అయితే  ప్రస్తుతం పాత నాణేలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటార వీటి ధర లక్షల్లో ఉంది. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థలు పాత నాణేలను కళ్ళు చెదిరే ధరకు విక్రయిస్తున్నాయి. ఒకప్పుడు రూపాయి కంటే తక్కువ విలువ ఉన్న నాణెంలకు ఇప్పుడు లక్షల్లో విలువ చేస్తుంది.

మీ వద్ద 20 పైసలు నాణెం లేదంటే 25 పైసలు నాణెం కలిగి ఉన్నారా? అయితే మీరు ఏకంగా రూ.2 లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది. అవును వినది, చదివేది నిజమే. వింతంగా ఉండొచ్చు. కానీ ఇది మాత్రం నిజం. ఎలా అనుకుంటున్నారా?

also read లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌.. రెండింతలైన బ్రిటానియా లాభాలు

ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్‌ను కళ్లుచెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి. ఈ కాయిన్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆన్‌లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్‌ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి.

ఓఎల్ఎక్స్‌లో పాత 20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 మధ్యలో చలామణిలో  ఉన్న 20 పైసలు నాణేల ధర ఏకంగా రూ.2 లక్షలు ఉంది. కాగా ఈ కాయిన్స్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమౌతోంది.

సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్‌ను విక్రయిస్తున్నాయి. అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ప్రారంభమౌతోంది. వీటి ధర కూడా రూ.వేలల్లోనే నడుస్తోంది. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా రూ.లక్ష వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు సిరీస్‌లోని కాయిన్స్ ధర రూ.లక్ష వరకు ఉంది. మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్‌లైన్ విక్రయించి కళ్లుచెదిరే లాభం పొందండి.