మహీంద్రా & మహీంద్రా కంపెనీ సి‌ఈ‌ఓ ఆనంద్ మహీంద్రా 1 ఏప్రిల్ 2020  నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. ఏప్రిల్ 1  నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరించనున్నట్లు ఆటో తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

also read  రోడ్డున పడనున్న 2 వేల మంది ఉద్యోగులు...కారణం...?

మహీంద్రా & మహీంద్రా కంపెనీ మరో పదిహేను నెలల్లో అనేక మంది ముఖ్య నాయకులు పదవీ విరమణ చేయనున్నారని తెలిపింది.కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌లో మార్పు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని మహీంద్రా & మహీంద్రా తెలిపింది.


అదే రోజు మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒగా తిరిగి నియమించనున్నట్లు మహీంద్రా & మహీంద్రా తెలిపింది.  నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ కోసం బోర్డుకు తెలపల్సిన సమస్యలపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రణాళిక, రిస్క్ తగ్గించడం, ఎక్స్ టర్నల్ ఇంటర్ఫేస్ రంగాలలో ఒక గురువుగా, సౌండింగ్ బోర్డుగా పనిచేస్తారని కంపెనీ తెలిపింది.

also read టాటాలకు గట్టి ఎదురు దెబ్బ... మిస్త్రీ అడుగు పెట్టడం కష్టమే?

"కంపెనీ ఇంటర్నల్ ఆడిట్ యూనిట్ తనకు అన్నీ విషయాలను రిపోర్ట్ చేస్తూ ఉంటుందని, నేను బోర్డు ద్వారా పర్యవేక్షణను కొనసాగిస్తాను" అని ఆనంద్ మహీంద్రా తెలిపారు.ముఖ్య సమస్యలపై మేనేజింగ్ డైరెక్టర్‌కు అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఆనంద్ మహీంద్రా కూడా అందుబాటులో ఉంటాడని కంపెనీ తెలిపింది.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా తన పదవీ విరమణ వరకు  సాంగ్‌యాంగ్ మోటార్స్ గ్రూప్ కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారు. 1 ఏప్రిల్ 2021 న, పవన్ కుమార్ గోయెంకా పదవీ విరమణ చేసిన తరువాత, అనీష్ షాకు మరుసటి రోజు నుండి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పదవి చేపట్టనున్నారు అని కంపెనీ ప్రకటనలో తెలిపింది. అనీష్ పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది.