Asianet News TeluguAsianet News Telugu

పరోటాపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌...సోషల్ మీడియా వైరల్..

రోటీ మాదిరిగానే పరోటాలను ఒకే ఆహార విభాగంలో ఉంచలేమని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌-కర్ణాటక బెంచ్‌ (ఏఏఆర్‌) పేర్కొంది. ఈ రెండూ పరోటా, రోటీ భారతీయ భోజనాలలో చాలా ప్రధానమైనవి.

Anand Mahindra's Parota Tweet Highlights in social media twitter
Author
Hyderabad, First Published Jun 12, 2020, 10:44 PM IST

న్యూ ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఉత్తర్వులపై  ట్వీట్ చేశారు. రోటీ మాదిరిగానే పరోటాలను ఒకే ఆహార విభాగంలో ఉంచలేమని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌-కర్ణాటక బెంచ్‌ (ఏఏఆర్‌) పేర్కొంది.

ఈ రెండూ పరోటా, రోటీ భారతీయ భోజనాలలో చాలా ప్రధానమైనవి. ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశానికి కొత్తగా పరోటా సవాల్‌ వచ్చి చేరిందని ట్విటర్‌ వేదికగా ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.  ఏఏఆర్‌ తాజా ప్రకటనతో పరోటా ఉనికికే ప్రమాదం వచ్చిందని ఆనంద్‌ మహింద్రా వ్యాఖ్యానిస్తు రోటీ కోవాకు చెందిన పరోటాను వేరు చేయడం బాధించిందని 7 మిలియన్లకు పైగా ఫలోవర్స్ ఉన్న ట్విట్టర్ యూసర్ ఆనంద్ మహీంద్రను ఆశ్చర్యపరిచింది.

దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళతో కొత్తగా 'పరోటా' సవాల్ వచ్చి చేరిందని, అయితే, భారత్‌లో కొత్తగా ‘పరోటీస్‌’ అనే వెరైటీ కూడా పుట్టుకొస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐడి ఫ్రెష్ ఫుడ్స్ ఇటీవల అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ (కర్ణాటక బెంచ్‌)ను ఆశ్రయించింది.

also read చమురు ధరలకూ అమ్మకాల సెగ..డీలా పడ్డా విదేశీ మార్కెట్లు..

రోటీ కేటగిరికి చెందిన పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. రోటీపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా పరోటాపై 18 శాతం పన్ను వసూలు చేస్తున్నారని విజ్ఞప్తిలో  పేర్కొంటూ  జీఎస్టీ కేటగిరి 1905 లోనే పరోటాను కూడా చేర్చాలని కోరింది.

అయితే, పరోటా, రోటీ తయారీలో తేడాలున్నాయని, 1905 కేటగిరీలో పరోటాను చేర్చలేమని ఏఏఆర్‌ వెల్లడించింది. 2106 కేటగిరీ ప్రకారం పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపింది. అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ 1905వ అధ్యాయం ఖక్రా, సాదా చపాతీ లేదా రోటీ' కింద వర్గీకరించలేమని పేర్కొంది.

ఐడి ఫ్రెష్ ఫుడ్స్ పరోటాస్, ఇడ్లీ, దోస పిండి, పెరుగు, భారతీయ చీజ్లతో సహా దాని శ్రేణిలోని కొన్ని వస్తువులకు వర్తించే జిఎస్టి రేటుపై తీర్పును కోరింది. ప్రస్తుతం 1905 కేటగిరీ కింద తాజాగా రోటీ మాదిరిగా కొన్ని ఉత్పత్తులు కేకులు, రొట్టెలు, బిస్కెట్లను చేర్చింది. పరోటాపై అధిక పన్నులు తగవని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎంతో రుచికరమైన పరోటాపై పగబట్టరంటు మీమ్స్‌ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ట్విటర్‌లో #HandsOffParotta  హాష్‌టాగ్‌ ప్రస్తుతం ట్రెడింగ్‌లో నిలిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios