పుణె టీచరుకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. పూణేలోని దక్కన్ జింఖానాలోని విమలబాయి గోఖలే హై స్కూల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమెకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది.

ఫిబ్రవరి 21న జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పూణేలోని ఒక దక్కన్ జింఖానాలోని విమలబాయి గోఖలే హై స్కూల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి ఫుట్‌పాత్‌లపై బైకులను ఎక్కించి ప్రయాణించే బైకర్లు ప్రయాణించకుండా అడ్డుకుని చీవాట్లు పెట్టింది.

also read జెట్​ ఎయిర్​వేస్​​ వ్యవస్థాపకుడిపై మనీ లాండరింగ్ కేసు...

సీనియర్ సిటిజన్  ఆమె తన వాహనాని దిగి  బైకర్లు ఫూట్ పాత్ ఎక్కి ముందుకు పాస్ అవ్వకుండా వారిని అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై ట్రాఫిక్ పోలీసులు వారి పనిని ఎందుకు చేయటం లేదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇది మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చూసి ట్వీట్ కూడా చేశారు. అతని ట్వీట్ లో "ఇప్పుడే నేను ఈ వీడియొ చూశాను & ఇప్పుడు నేను  అందరూ ఆంటీస్ లకు అభిమాని అయిపోయాను. ఈ ఆంటీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో జరుపుకోవాలి అని అన్నారు.

also read జీతం పొందే ఉద్యోగులకు చేదు వార్త... ఇపిఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తూ నిర్ణయం..

ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసు అధికారులు జోక్యం చేసుకునే వరకు వేచి ఉండకుండా ఆమెనే స్వయంగా జోక్యం చేసుకుటం విశేషం.వీడియోలో హై స్కూల్ ఉపాధ్యాయురాలైన ఆమె కొన్ని ద్విచక్ర వాహనాలు సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ ను దాటడానికి ఫుట్‌పాత్‌ పైకి వాహనాలను ఎక్కించి ముందుకు వెళ్తుంటారు, మరి కొందరైతే ఏకంగా ఫూట్ పాత్ పైకి వాహనాన్ని ఎక్కించి సిగ్నల్ నే దాటేస్తారు.

ఇలాంటి వారిని  ట్రాఫిక్ పోలీసులు వచ్చి అడ్డుకునే దాకా వేచి చూడకుండా తనే స్వయంగా ఫూట్ పాత్ పై నిల్చోని ఫుట్‌పాత్ అనేది పాదచారులకు మాత్రమేనని, ద్విచక్ర వాహనాల కోసం కాదని చాలా స్పష్టంగా చెప్పి వారికి బుద్ది చెప్పింది.