Asianet News TeluguAsianet News Telugu

విడాకులిచ్చి భార్యను ప్రపంచంలోనే సంపన్నురాలిగా మారుస్తున్న భర్త

అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫో బెజోస్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నరనే వార్త కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం కలిగించింది. సుమారు పాతికేళ్ల పాటు కలిసున్న ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది.

Amazon chief Jeff Bezos and wife MacKenzie divorce
Author
New York, First Published Jan 11, 2019, 9:18 AM IST

అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫో బెజోస్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నరనే వార్త కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం కలిగించింది. సుమారు పాతికేళ్ల పాటు కలిసున్న ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది.

కొన్ని నెలలుగా విడిగా ఎలా ఉండగలమనేది ప్రయోగాత్మకంగా చూశామని, విడిపోయి స్నేహితులుగా ఉండగలమనే నమ్మకం వచ్చాక చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాట్లు జెఫ్ బెజోస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విడాకుల వల్ల జెఫ్ తన ఆస్తిలో సగం అంటే దాదాపు 62.15 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 4.2 లక్షల కోట్లు) భార్య మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళగా మెకంజీ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

దీనితో పాటు ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా ఆమె అవతరించనున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-లారెన్ శాంచెజ్ అనే ఫాక్స్ టెలివిజన్ హోస్ట్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు.  

లారెన్ మాజీ భర్త, హాలీవుడ్ ఏజెంట్ ప్యాట్రిక్ వైట్సెల్ స్వయంగా లారెన్‌ను బెజోస్‌కు పరిచయం చేశాడు. లారెన్ లైసెన్స్ కలిగిలిన హెలికాఫ్టర్‌కు పైలట్‌... దానితో పాటు ఏరియల్ ఫిల్మింగ్‌లో ఆమెకు నైపుణ్యం ఉండటమే కాకుండా అనేక హాలీవుడ్ సినిమాలకు ఏరియల్ ఫిల్మింగ్ కన్సల్టెంట్‌గా సైతం వ్యవహరించారు.

మరోవైపు వారం క్రితం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ను దాటి అమెజాన్ అవతరించింది. కానీ జెఫ్ బెజోస్ విడాకుల కారణంగా కేవలం కొద్దిరోజుల్లోనే ఆయన తన ఆస్తిని కోల్పోవడంతో.. తిరిగి మైక్రోసాఫ్ట్‌ అత్యధిక టర్నోవర్ ఉన్న కంపెనీగా అవతరించింది.

క్రైసిస్‌లో అమెజాన్ ఫౌండర్: మెక్కెంజోతో జెఫ్ డైవోర్స్

Follow Us:
Download App:
  • android
  • ios