న్యూ ఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు నిరసనగా, వచ్చే వారం కేంద్ర కార్మిక సంఘాలు అఖిల భారత సార్వత్రిక సమ్మెలో చేరాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించాయి.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి బ్యాంక్ యూనియన్లు జనవరి 8న పనిలో చేరవద్దని సంఘాల సభ్యులను కోరాయి.

also read ఐఫోన్ సేల్స్ తగ్గిపోవడంతో: తగ్గిన ఆపిల్ సీఈఓ వేతనం

బ్యాంకుల సమ్మె ఫలితంగా శాఖలు, ఎటిఎంల వద్ద సాధారణ బ్యాంకింగ్ సేవలు బుధవారం మూసివేసే అవకాశం ఉంది. నెట్‌బ్యాంకింగ్ సేవలు NEFT, IMPS ఇంకా RTGS బదిలీలు ఎలాంటి  ప్రభావం ఉండదు. ఆన్‌లైన్ NEFT బదిలీ ఛార్జీలను ఆర్‌బిఐ మాఫీ చేసింది, బదిలీ ప్రక్రియ ఇప్పుడు 24x7 గా చేయబడింది.


సమ్మె రోజున ఎటువంటి కీలను డిమాండ్ చేయవద్దని, అంగీకరించవద్దని, క్లరికల్ విధులను నిర్వర్తించవద్దని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి) ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా సభ్యులను కోరారు.జీతం పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు, బ్యాంకింగ్ సంస్కరణలు, బ్యాంకు విలీనాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేస్తోంది.

also read సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు...: మిస్త్రీ పై రతన్ ఫైర్

"బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు వేతనలపై మా చట్టబద్ధమైన డిమాండ్ అనవసరంగా ఆలస్యం చేస్తోంది. 5 రోజుల బ్యాంకింగ్ పని దినాల డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉద్యోగులు, అధికారులు అధిక పనిభారంతో బాధపడుతున్నారు అలాగే బ్యాంకులలో కూడా తగిన నియామకాలు జరగడం లేదు "అని వివిధ బ్యాంకు సంఘాలు సంతకం చేసిన సమ్మె నోటీసులో వివరించారు.

బ్యాంక్ సమ్మె పిలుపుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF) మరియు ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC) కూడా మద్దతు ఇస్తున్నాయి.