చైనా బిలియనీర్ కొంతకాలంగా  హాంకాంగ్‌లో ఉన్నారని అక్కడ అతను స్నేహితులను కలిసినట్లు, ఆర్ట్ బాసెల్ అనే అంతర్జాతీయ కళా ప్రదర్శనను సందర్శించాడని ఇంకా వ్యవసాయ సాంకేతికత గురించి తెలుసుకోవడానికి జాక్ మా వివిధ దేశాలకు వెళుతున్నట్లు అందులో పేర్కొంది. 

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత మూడు సంవత్సరాలుగా చాలా అరుదుగా బహిరంగంగా కనిపించాడు, తాజాగా హాంగ్‌జౌలోని ఒక స్కూల్ లో మళ్లీ కనిపించాడు. 58 ఏళ్ల జాక్ మా 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలను విమర్శించారు. ఆ తర్వాత ఆయన ‘అదృశ్యం’ అయ్యారని ఊహాగానాలు వచ్చాయి. అతను బహిరంగంగా కనిపించడం దాదాపు మానేశాడు. టెక్ వ్యవస్థాపకులపై అణిచివేత తర్వాత అదృశ్యమైన అత్యంత ఉన్నత స్థాయి చైనీస్ బిలియనీర్ జాక్ మా. చైనా మీడియా కథనాల ప్రకారం, జాక్ మా విదేశాలలో ఏడాదికి పైగా గడిపిన తర్వాత చైనాకు తిరిగి వచ్చాడు.

చైనా మీడియా వాదనలు
 చైనా బిలియనీర్ కొంతకాలంగా హాంకాంగ్‌లో ఉన్నారని అక్కడ అతను స్నేహితులను కలిసినట్లు, ఆర్ట్ బాసెల్ అనే అంతర్జాతీయ కళా ప్రదర్శనను సందర్శించాడని ఇంకా వ్యవసాయ సాంకేతికత గురించి తెలుసుకోవడానికి జాక్ మా వివిధ దేశాలకు వెళుతున్నట్లు అందులో పేర్కొంది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో జాక్ మా ఎందుకు బహిరంగంగా కనిపించడం లేదని వార్తాపత్రిక నివేదికలో పేర్కొనలేదు.

అక్టోబర్ 2020 తర్వాత జాక్ మా 
 వచ్చే నెలలో 26 బిలియన్ యెన్‌ల విలువైన IPOని ప్రారంభించాలని యాంట్ గ్రూప్ ప్లాన్ చేసింది, ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉండేది, చైనా అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

 అప్పటి నుండి, అతను బహిరంగంగా కనిపించడం దాదాపు మానేశాడు. అయితే ఈ సమయంలో జాక్ మా స్పెయిన్, నెదర్లాండ్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియాతో సహా పలు దేశాల్లో కనిపించినట్లు సమాచారం. జాక్ మా ఆరు నెలలుగా జపాన్‌లోని టోక్యోలో నివసిస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో ఒక వార్తాపత్రిక నివేదించింది. జాక్ మా బహిరంగంగా కనిపించడం మానేసినప్పుడు, అతన్ని గృహనిర్బంధంలో ఉంచారు లేదా నిర్బంధించారని పుకార్లు వచ్చాయి.