న్యూ ఢిల్లీ: వందే భారత్ మిషన్ -3 భాగంగా ఉత్తర అమెరికా, కెన‌డా, యూరప్ దేశా ప్ర‌యాణాల‌కు బుకింగ్ మొద‌లుపెట్టింది. బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే  22వేల  సీట్లను ఎయిర్ ఇండియా (AI) విక్రయించింది. ప్రయాణికుల భారీ డిమాండ్ వల్ల ఎయిర్ ఇండియా విమానాలు ఈ నెలలో ఒక ఎంపికగా ఉన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ కు కోట్లాది హిట్‌లు వచ్చాయి. కాగా ప్రజలు టికెట్ కొనుగోలు చేయడానికి చాలా కష్టపడ్డారు.

వందే భారత్ మిషన్- 3వ దశ కింద యూ‌ఎస్‌ఏ, కెనడా, యూ‌కే, యూరప్‌లోని ఎంపిక చేసిన ప్రదేశాలకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. మా వెబ్‌సైట్ యాక్టివిటి ఏడింత‌లు పెరిగిన‌ట్లు ఎయిర్ ఇండియా పేర్కొన్న‌ది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు మొత్తం 22,000 సీట్లు అమ్ముడయ్యాయి అని ఆ సంస్థ తెలిపింది.  

రాబోయే రోజుల్లో మ‌రిన్ని రూట్ల‌లో విమానా ప్ర‌యాణాల‌ను విస్త‌రించ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా సంస్థ శనివారం ఉదయం 9.20 గంటలకు ట్వీట్ చేసింది. యూ‌ఎస్ విమానాల కోసం ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రజలు ఆందోళన చెందవద్దని  ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

also read సొంత ప్రయాణాలకి చార్టర్ట్ ఫ్లైట్.. కరోనా నేపథ్యంలో సంపన్న కుటుంబాలు తీరు..

వెబ్‌సైట్ కు ఒకేసారి కోట్ల హిట్స్ వచ్చినందున చాలామంది దీనిని యాక్సెస్ చేయలేకపోయారు. అవసరమైతే మేము మరిన్ని విమానాలను నడుపుతాము" అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఎయిర్ ఇండియా టికెట్లను ఎందుకు విక్రయించలేదని ప్రయాణీకులు ఆశ్చర్యపోతున్నారు.

"ఇది అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి, ఈ టికెట్ అమ్మకాలకు తమకు ఎటువంటి కమీషన్ లభించదని ఎయిర్ ఇండియా ఆన్ లైన ట్రావెల్ ఏజేన్సిలకు తెలిపింది. 

ఈ నెలలో న్యూయార్క్, నెవార్క్, చికాగో, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్, టొరంటో వంటి ఉత్తర అమెరికా ప్రదేశాలకు ఎయిర్ ఇండియా 75 అదనపు విమానాలను నడుపుతోంది, విదేశీ పౌరులు వాటిపై ప్రయాణించవచ్చు. జూన్ ప‌ది నుంచి జూలై ఒక‌ట‌వ తేదీ వ‌ర‌కు వందేభార‌త్ మూడ‌వ ద‌శ‌ను ఆప‌రేట్ చేయ‌నున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా త‌రలిస్తున్న విష‌యం తెలిసిందే.