ఐపీవో మార్కెట్లో LIC తర్వాత మరికొన్ని ఐపీవోలు కూడా ప్రైమరీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే రేపటి నుంచి ప్రముఖ కెమికల్ కంపెనీ ఏథర్ ఇండస్ట్రీస్ కూడా ఐపీవో ద్వారా నిధుల సేకరణకు దిగుతోంది. అయితే ఇష్యూ దర ఎంత, గ్రే మార్కెట్ లో ఎంత పలుకుతుందో తెలుసుకోండి. 

ఏథర్ ఇండస్ట్రీస్ (Aether Industries IPO) ఐపీవో 24 మే 2022న ప్రైమరీ మార్కెట్‌లను తాకబోతోంది. 26 మే 2022 వరకు బిడ్డింగ్ కోసం తెరిచి ఉంచనున్నారు. ఈ కెమికల్ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.808.04 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 808.04 కోట్లలో, కంపెనీ తాజా ఇష్యూ ద్వారా 627 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మిగిలిన 181.04 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా వస్తాయని భావిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏథర్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.21 ప్రీమియంతో లిస్ట్ అయ్యే చాన్స్ ఉందని భావిస్తున్నారు. 

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) GMP: 
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏథర్ ఇండస్ట్రీస్ IPO గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఈ రోజు రూ. 21, అంటే ఇష్యూ తేదీకి ముందు పబ్లిక్ ఇష్యూపై గ్రే మార్కెట్ బుల్లిష్‌గా ఉంది.

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) తేదీ
పబ్లిక్ ఇష్యూ 24 మే 2022 నుంచి 26 మే 2022 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ చేసి ఉంచుతారు. 

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) ప్రైస్ బ్యాండ్:
ఈ కెమికల్ కంపెనీ తన పబ్లిక్ ఆఫర్ ధరను ఒక్కో షేరుకు రూ.610 నుంచి రూ.642గా నిర్ణయించింది.

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) ఆర్థిక స్థితి
FY22 9 నెలల్లో, Ather ఇండస్ట్రీస్ మొత్తం ఆదాయాన్ని 449.3 కోట్లుగా నమోదు చేసింది, అయితే ఈ కాలంలో దాని PAT 82.9 కోట్లుగా ఉంది. FY19లో, దాని మొత్తం ఆదాయం 203.2 కోట్లు కాగా, దాని PAT 23.3 కోట్లుగా ఉంది. 

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) టార్గెట్:
కెమికల్ కంపెనీ తన పబ్లిక్ ఇష్యూ నుండి సేకరించిన డబ్బును రుణాలను చెల్లించడానికి, ఫైనాన్స్ క్యాపిటల్ ఖర్చులు, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు స్పష్టం చేసింది.

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) లాట్ సైజు:
ఒక బిడ్డర్ ఒక లాట్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఐపిఓ లాట్ లో 23 ఏథర్ ఇండస్ట్రీస్ షేర్లు ఉంటాయి.

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) కేటాయింపు తేదీ:
ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల కేటాయింపు కోసం 31 మే 2022 తేదీని నిర్ణయించారు. 

ఏథర్ ఇండస్ట్రీస్ IPO (Aether Industries IPO) లిస్టింగ్ : 
BSE, NSEలలో ఈ కంపెనీ షేర్లు జూన్ 3, 2022న లిస్ట్ కానున్నాయి.