అదానీ గ్రూప్ తన కొన్ని కంపెనీల ఆడిట్ నిర్వహించడానికి గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించినట్లు కొన్ని రోజుల క్రితం పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ప్రఖ్యాత అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకున్నట్లు వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత, గౌతమ్ అదానీ యాజమాన్యంలోని గ్రూపు ఈ వార్తలను ఒట్టి పుకారుగా తోసిపుచ్చింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ తమ కంపెనీల ఆడిట్ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకున్న వార్తలను ఒక "పుకారు" అని పేర్కొంది. కంపెనీ గురువారం ఈ కీలక వివరణను అదానీ గ్రూపు స్టాక్ ఎక్స్ చేంజీలతో పంచుకుంది. ఎక్స్ఛేంజీలకు పంపిన ఈ వివరణ నోటీసులో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇలా పేర్కొంది. దీనికి సంబంధించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ప్రకటనలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ గ్రాంట్ థార్న్‌టన్ ను ఆడిటర్ గా నియామంచుకున్నట్లు వచ్చిన వార్త పుకారు మాత్రమే అని, అందువల్ల దానిపై మేము వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొంది.
మేము సెబీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కంపెనీ ఎలాంటి సమాచారం అయినా మార్కెట్ రెగ్యులేటర్లతోనూ అలాగే ఎక్స్చేంజీలతోనూ పంచుకుంటామని, ఒప్పందం ప్రకారం మేము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడానికి 2015 నాటి సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్ రెగ్యులేషన్స్ కింద ఉన్నటువంటి అన్ని నిబంధనలను పాటిస్తున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది. ఇదిలా ఉంటే మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ విషయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుండి వివరణ కోరింది.
సెబీ సమాధానం కోరింది
ప్రముఖ వార్తా పత్రికలో వచ్చిన కథనంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వివరణ కోరిన రెండు రోజుల తర్వాత అదానీ గ్రూపు నుంచి ఈ ప్రకటన వెలువడింది. షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ క్లెయిమ్‌లను తొలగించడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్‌లను నిర్వహించడానికి గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏం చెప్పింది?
అదానీ ఎంటర్‌ప్రైజెస్, సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్ రెగ్యులేషన్స్, 2015 కింద , స్టాక్ ఎక్స్ఛేంజీలతో మా ఒప్పందాలకు అనుగుణంగా మేము మా బాధ్యతలను నిర్వహించి జరిగిన విషయం బహిర్గతం చేసామని, భవిష్యత్తులో ఇదే సాంప్రదాయం కొనసాగిస్తామని చెప్పాలనుకుంటున్నామని తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంకా మాట్లాడుతూ మార్కెట్లో నడుస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, దీనిపై ప్రకటనలు చేయడం సముచితం కాదని కంపెనీ పేర్కొంది.
అదానీకి షాక్ ఇచ్చి స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబరల్ రేటింగ్స్
అదానీ గ్రూప్‌కు సంబంధించి అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ తన నివేదికను విడుదల చేసినప్పటి నుండి, ఈ గ్రూప్ ఇబ్బందుల్లో ఉంది. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL) కోసం S&P గ్లోబల్ రేటింగ్ ఇవ్వగా అందులో, అదాని ESG గురించి 'పరిశీలనలో' (Under Review) ఉంచినట్లు రిపోర్టు చేసింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ESG) ప్రమాణాలను పర్యవేక్షించేటప్పుడు S&P 'పరిశీలనలో ఉంది'(Under Review) అనే పదాన్ని ఉపయోగిస్తుంది. S&P గ్లోబల్ రేటింగ్స్ భారతీయ రెగ్యులేటర్ నుంచి ఏదైనా విచారణ లేదా, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల పనితీరు సహా అన్ని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
