ట్విట్టర్ కంపెనీని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత సంబరాలు చేసుకుంటున్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి వ్యక్తి కాగా, ఇప్పుడు ఆ వరుసలో బాలివుడ్ నటి కంగనా రనౌత్ కూడా నిలిచారు. గతంలో ఓ హింసాత్మక ట్వీట్ పోస్ట్ చేసినందుకు గానూ, కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా ట్విట్టర్ అకౌంట్ గతేడాది సస్పెండ్ కు గురైంది. రాజకీయాల నుండి బాలీవుడ్ వరకు అన్ని విషయాలపై తీవ్రంగా ట్వీట్ చేయడం కంగనాకు అలవాటు. అయితే గతంలో ఆమె చేసిన కొన్ని ట్వీట్స్ మత సామరస్యం దెబ్బతీయడంతో పాటు,పలు వర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసింది. దీంతో దీంతో కంగనా ట్వీట్లను ట్విట్టర్ డిలీట్ చేసి మొదట వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కంగనా మరోసారి కూడా అలాంటి ట్వీట్ చేయడంతో శాశ్వతంగా ఆమె అకౌంట్ను బ్లాక్ చేసింది. దీంతో కంగన చివరకు చేసేదేమి లేక, ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను తెలుపుతోంది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా తన పేజీలో ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను ట్విట్టర్లో కొనసాగేందుకు వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ డీల్ 44 బిలియన్ యుఎస్ డాలర్లకు పూర్తయింది. దీంతో పాటు పరాగ్ అగర్వాల్‌తో పాటు ఇద్దరు మేనేజర్లను కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ కు చెందిన పరాగ్ నవంబర్ 2021లో Twitter CEO అయ్యారు.
కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ రీస్టోర్ అవుతుందా..
కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అభిమానులలో ఒకరి పోస్ట్‌ను పంచుకున్నారు, దీనిలో నటి కంగనా రనౌత్ అకౌంట్ పునరుద్ధరించమని ఎలాన్ మస్క్‌ను కోరారు. ఈ వ్యక్తి ఎలోన్ మస్క్ దానిని పునరుద్ధరిస్తాడని ఆశిస్తూ, వాక్ స్వాతంత్ర స్ఫూర్తిని గౌరవిస్తూ పోస్ట్ చేసారు. దీనిని కంగనా తన ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేసింది, ఇందులో పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన వార్తలపై కంగనా చప్పట్లు కొట్టే ఎమోజీతో షేర్ చేసింది.
గత ఏడాది మే నెలలో, వివాదాస్పద ట్వీట్ కారణంగా కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేయబడింది. కంగనా త్వరలో 'ఎమర్జెన్సీ' చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా, ప్రముఖ బెంగాలీ థియేటర్ నటి బినోదిని దాసి బయోపిక్ లో కూడా నటిస్తోంది.
