మీరు మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేయలనుకుంటే లేదా ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే మీరు పోస్టాఫీసు, బ్యాంక్ లేదా ఆధార్ సేవా కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామా మార్చాలనుకుంటే, మీరు ఇంటి నుండే మార్చుకొవచ్చు.

మీరు ఆధార్‌లోని చిరునామాను మార్చాలనుకుంటే, మీరు uidai.gov.in కు వెబ్ సైట్ ద్వార మార్చుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీరు 'అడ్రస్ అప్ డేట్ రిక్వెస్ట్ (ఆన్‌లైన్)' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

క్లిక్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, మీరు మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబరును రిజిస్టర్  చేయాలి. దీని తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, 'సెండ్  ఓ‌టి‌పి' పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్‌ కి వచ్చే ఓ‌టి‌పి ఎంటర్ చేసి, ఆపై తదుపరి ప్రాసెసింగ్ కోసం లాగిన్ పై క్లిక్ చేయండి. తరువాతి పేజీలో, మీరు చిరునామాపై క్లిక్ చేసి ప్రాసెసింగ్ చేయాలి.

also read ఫోర్బ్స్ ఇండియా అత్యంత సంపన్నుల జాబితాలో పతంజలి సిఇఒ.. అతని సంపద ఎంతో తెలుసా ? ...

కొత్తగా ఓపెన్ చేసిన పేజీలో, మీరు మీ పూర్తి వివరాలను జాగ్రత్తగా నింపాలి. మీరు ఇంగ్లీషులో ఇచ్చిన సమాచారం మీ స్థానిక భాషలో కూడా సరిగ్గా అనువదించి గుర్తుంచుకోవచ్చు. దీని తరువాత, ఆధార్ కార్డులో మీ కొత్త చిరునామాను నమోదు చేయడానికి, మీరు కొన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

దీని కోసం, ఆధార్ కార్డులో మీకు కావలసిన చిరునామా, అదే చిరునామాతో ఉన్న  ఏదైనా సర్టిఫికేట్ నమోదు చేయాలి. సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు యూ‌ఐ‌డి‌ఏ‌ఐ నుండి అప్ డేట్ రిక్వెస్ట్ నంబరు  ఇవ్వబడుతుంది. దీని సహాయంతో, మీరు మీ అప్లికేషన్ స్టేటస్  సులభంగా ట్రాక్ చేయవచ్చు.

చిరునామాను అప్ డేట్ కోసం  కావల్సిన  సర్టిఫికేట్ : మీరు చిరునామాను ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ స్కాన్ చేసిన కాపీని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇది కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, వారి ఐడి, ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్, వైకల్యం సర్టిఫికేట్, రైతు ఫోటో పాస్ బుక్, పెన్షనర్ ఫోటో కార్డుతో సహా ఇతర సర్టిఫికేట్లను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.