పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.
భారతదేశంలోని టాప్ 100 ధనవంతుల జాబితాలో పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ 66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.
దీంతో ఆయన గత సంవత్సరంతో పోల్చితే ధనికుల జాబితాలో 31 స్థానాలు అధిగమించారు. 2019 ఫోర్బ్స్ టాప్ 100 ధనవంతుల జాబితాలో అతను 97వ స్థానంలో నిలిచారు. అప్పుడు అతని సంపద 1.47 బిలియన్ డాలర్లు అంటే 10,700 కోట్ల రూపాయలు.
అయితే ఆచార్య బాలకృష్ణ 2018 కంటే ఇప్పుడు అతని సంపద తక్కువగా ఉంది. ఫోర్బ్స్ 2018 జాబితాలో పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణకు రూ.35,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపింది. బాబా రామ్‌దేవ్ సహాయకుడు ఆచార్య బాలకృష్ణ 2018 ఫోర్బ్స్ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు.
also read రోజుకు రూ.189 పెట్టుబడితో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...
ఫోర్బ్స్ జాబితాలో ఇంత ఉన్నత ర్యాంకు సాధించిన ఆచార్య బాలకృష్ణ అందరినీ షాక్‌కు గురిచేసింది. కరోనా కాలంలో కూడా అతని సంపద కిందటి సంవత్సరంతో పోలిస్తే సుమారు 6,000 కోట్ల రూపాయలు పెరిగింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ సేల్స్ లాక్ డౌన్ లో పెరగడమే దీనికి కారణం. ఇది కాకుండా పతంజలి మూలికా ఉత్పత్తులు, రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు కూడా భారీ డిమాండ్ పెరిగింది. ఆచార్య బాలకృష్ణకు పతంజలి ఆయుర్వేదంలో 98.5% వాటా ఉంది.
ఇటీవల, పరుంజలి ఆయుర్వేద్ అధిపతి ఆచార్య బాలకృష్ణ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లోని 18 వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇది కాకుండా అతని ఆస్తులు రూ .46,800 కోట్లు అని వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా అలాగే హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లోని ఆచార్య బాలకృష్ణ సంపదలో పెద్ద తేడా ఉంది.