డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి....
డిసెంబర్ 31 లోగా మీ ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డుని లింక్ చేయకపోతే వారి ఆధార్ కార్డు, పాన్ కార్డుని పరిగణలోకి తిసుకోరు. 2019 ముగిసేలోపు భారతీయ నివాసి పాన్‌ను అతని / ఆమె ఆధార్ కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
న్యూ ఢిల్లీ: ప్రవాస భారతీయలు ఈ సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ 31 లోగా మీ ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డుని లింక్ చేయకపోతే వారి ఆధార్ కార్డు, పాన్ కార్డుని పరిగణలోకి తిసుకోరు. 2019 ముగిసేలోపు భారతీయ నివాసి పాన్‌ను అతని / ఆమె ఆధార్ కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారైకి ఆధార్, పాన్ కార్డ్ రెండూ ఉంటే వాటిని లింక్ చేయవలసి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్నారై పాన్ కార్డు మరియు ఆధార్ రెండింటినీ తప్పకుండ కలిగి ఉండాలని సూచించారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎన్నారైలకు భారతదేశంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే లేదా దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పాన్ కార్డు తప్పనిసరి అని తెలిపింది.
also read బ్యాంక్ చెక్ పైన డేట్ రాస్తున్నారా?...అయితే జాగ్రత్త....లేదంటే..?
ఇంతకుముందు సెప్టెంబర్ 30 చివరి గడువుగా తెలిపింది కానీ ఇప్పుడు ఆ గడువు డిసెంబర్ 31 కు పొడిగించింది. ఆధార్, పాన్ అనుసంధానం మొదట 2017 లో అమలు చేయాలని ప్రతిపాదించారు, కాని అప్పటి నుండి గడువు చాలాసార్లు పొడిగించారు.ఇంతకు ముందే చెప్పినట్లుగా పాన్, ఆధార్‌తో అనుసంధానించకపోతే వారి పాన్, ఆధర్ పరిగణలోకి తీసుకోము అని తెలిపింది. ఏదేమైనా బ్యాంక్ విధానాల నుండి భూమి / ఆస్తి కొనుగోలు వరకు భారతదేశంలో అనేక లావాదేవీలకు పాన్ తప్పనిసరి.
ఈ సంవత్సరం ప్రారంభంలో జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం జూలై 2017 న లేదా అంతకు ముందు పాన్ కార్డు పొందిన ఎన్‌ఆర్‌ఐలు వారి ఆధార్‌తో లింక్ చేయవలసి ఉంటుంది. దీనిని ఎస్‌ఎంఎస్, ఆన్‌లైన్ లేదా సేవా కేంద్రాల ద్వారా చేయవచ్చు. భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలైలో ఎన్నారైలకు ఆధార్ కార్డులను జారీ చేయాలని ప్రతిపాదించారు. మొబైల్ నంబర్ పొందడం లేదా ప్రభుత్వ ప్రయోజనాలు / సబ్సిడీ పొందడం, అనేక లావాదేవీలకు ఆధార్ కార్డు ప్రధాన అవసరం.
పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించాల్సిన అవసరం ఏమిటంటే, భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు, పాన్ కార్డ్ వివరాలను ఇవ్వడమే కాకుండా, ఆధార్ నంబర్‌ను కూడా అవసరం. ఎన్‌ఆర్‌ఐలు ఆధార్, పాన్ కలిగి ఉన్న వారు ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్: https://incometaxindiaefiling.gov.in/ ద్వారా లింక్ చేయవచ్చు.
also read బ్యాంకుల్లో లక్షల కోట్ల మోసాలు...గుర్తించించిన ఆర్బీఐ
నవంబర్ 11 నాటికి 293 మిలియన్ పాన్ కార్డులు ఆధార్ నంబర్లతో అనుసంధానం జరిగింది అని భారత జూనియర్ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో చెప్పారు. నవంబర్ నాటికి, ఎన్నారైల కోసం 2,800 మందికి పైగా ఆధార్ కార్డులు జారీ చేశాము అని భారత ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
పాన్ అనేది భారతదేశ ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ‘పెర్మనెంట్ అక్కౌంట్ నెంబర్’. ఇది దేశంలో ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నివాసితులకు లేదా పాస్పోర్ట్ హోల్డర్లకు జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్.