ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి, ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITRలు)  క్విక్ ఇ-వెరిఫికేషన్ లో  వారికి సహాయపడుతుంది.  

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ  31 మార్చి 2022. మీ ఆధార్‌ను పర్మనెంట్ అక్కౌంట్ నంబర్ (PAN)తో లింక్ చేయడానికి చివరి తేదీ సమీపిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి, ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITRలు)  క్విక్ ఇ-వెరిఫికేషన్ లో  వారికి సహాయపడుతుంది.

" ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల లింక్డ్ బెనిఫిట్స్ తో వస్తుంది! వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఐటీఆర్‌ల క్విక్ వెరిఫికేషన్" అని ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ట్వీట్ చేసింది.

ఆధార్-పాన్ లింక్ చివరి తేదీ
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ 31 మార్చి 2022.

పాన్-ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి
మీరు https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar వెబ్ సైట్ ని సందర్శించాలి. ఇప్పుడు పాన్, ఆధార్ నంబర్, ఆధార్ ప్రకారం పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయండి. ఈ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, "లింక్ ఆధార్"పై క్లిక్ చేయండి.

మొబైల్ నంబర్
మీరు ఏదైనా మొబైల్ నంబర్ ద్వారా మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఇందుకు మీరు 56677 - UIDPANకి ఎస్‌ఎం‌ఎస్ పంపాలి.

పాన్-ఆధార్ లింక్ స్టేటస్ కోసం మీరు  - https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar సందర్శించాల్సిన అవసరం ఉంటుంది.

ఇక్కడ మీరు పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చాను ఎంటర్  చేయాలి. చివరగా, సబ్మిట్ పై క్లిక్ చేయండి, ఇప్పుడు మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది.