ఆల్ఫాబెట్ (Google), అమెజాన్ (Amazon), టెస్లా (Tesla), మెటా ప్లాట్‌ఫారమ్‌ (Facebook), మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలని ఉందా...దేశీయ మార్కెట్ల కన్నా కూడా యూఎస్ మార్కెట్లలోని షేర్స్ ద్వారా ఎక్కువ లాభాలను పొందాలని ఉందా. అయితే  నేటి నుంచి NSE IFSC ప్లాట్‌ఫారమ్ దీన్ని సాధ్యం చేయనుంది. 

దేశీయ స్టాక్ మార్కెట్లలో డబ్బు సంపాదించడం ఒక కళ, కానీ అంతర్జాతీయంగా రాణిస్తున్న మార్కెట్లలో కూడా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా. అయితే అందుకు NSE, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా, NSE IFSC platform (National Stock Exchange International Financial Services Centre) ప్రారంభించింది. దీని ద్వారా మీరు విదేశీ సూచీల్లోని స్టాక్స్ సైతం కొనుగోలు చేయవచ్చు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) పూర్తి యాజమాన్యంలోని NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (NSE IFSC) ప్రస్తుతం ఎంపిక చేసిన US స్టాక్‌లలో ట్రేడింగ్ ప్రారంభించినట్లు ప్రకటించింది. NSE IFSC ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇకపై అంతర్జాతీయంగా పేరెన్నికగల స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం సులభతరం అవుతుంది. US స్టాక్‌ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్, హోల్డింగ్‌లు IFSC అథారిటీ రెగ్యులేటరీ నిర్మాణం ద్వారా ఖచ్చితంగా నిర్వహించనున్నారు. 

మార్చి 3, 2022 నుండి ట్రేడింగ్ ప్రారంభం కానున్న NSE IFSC ఎక్స్ఛేంజ్ మొత్తం 8 అమెరికన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఈ జాబితాలో ఆల్ఫాబెట్ (Google), అమెజాన్ (Amazon), టెస్లా (Tesla), మెటా ప్లాట్‌ఫారమ్‌ (Facebook), మైక్రోసాఫ్ట్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, వాల్‌మార్ట్ ఉన్నాయి. 

త్వరలో మరి కొన్ని స్టాక్‌లలో ట్రేడింగ్ తర్వాత ప్రారంభమవుతుంది
NSE IFSC త్వరలోనే మిగిలిన US స్టాక్‌ల ట్రేడింగ్ ప్రారంభ తేదీ తర్వాత తెలియజేయనున్నట్లు ఎక్స్ఛేంజ్ తెలిపింది. వీటిలో బెర్క్‌షైర్ హాత్వే, మాస్టర్ కార్డ్, JP మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీ, నైక్, పేపాల్, పెప్సికో, ఫైజర్, ఇంటెల్, అడోబ్, మాస్టర్ కార్డ్, జాన్సన్ & జాన్సన్, వెల్స్ ఫార్గో మొదలైనవి ఉన్నాయి. గుజరాత్ లోని GIFT సిటీలో తెరిచిన డీమ్యాట్ ఖాతాలలో డిపాజిటరీ రిసీప్ట్ లను కలిగి ఉంటాయి. 

ఆర్‌బీఐ పరిమితి కింద ట్రేడింగ్ జరుగుతుంది
NSE IFSC ఆగస్ట్‌లో జారీ చేసిన సర్క్యులర్‌లో, “IFSC ద్వారా భారతదేశంలోని రిటైల్ పెట్టుబడిదారులు NSE IFSC ప్లాట్‌ఫారమ్ ద్వారా RBI సూచించిన విధంగా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితి కింద వ్యాపారం చేయగలరు." అని సూచించింది. 

NSE IFSC మార్గం ద్వారా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్లో ప్రవేశించడం సులభం అవుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు భారతీయ రిటైల్ పెట్టుబడిదారులకు ఖర్చును కూడా తగ్గిస్తుంది. US మార్కెట్‌లలోని ట్రేడింగ్ షేర్‌లతో పోలిస్తే పెట్టుబడిదారులు పాక్షిక పరిమాణ విలువలలో ట్రేడింగ్ చేసే ఎంపికను పొందుతారు, ఇది వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది.

NSE IFSC బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుంది
ఇది "NSE IFSC క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (NICCL) తన బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను అందజేస్తుందని, డిపాజిటరీ రిసీప్ట్ లో అన్ని ట్రేడ్‌ల కోసం క్లియరింగ్, సెటిల్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది. అలాగే, IFSC ప్లాట్‌ఫారమ్‌లో జరిగే అన్ని ట్రేడ్‌లకు సంబంధించి NSE సెటిల్‌మెంట్ హామీని అందిస్తుంది. అదనంగా అన్ని ట్రేడ్‌లు కూడా NSE IFSC యొక్క ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ కింద కవర్ చేయబడతాయి.