మాస్టర్స్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. 5 సంవత్సరాల వీసా ప్రకటించిన ప్రధాని మోదీ..
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికారు.
ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు ఐదేళ్ల దీర్ఘకాలిక పోస్ట్ స్టడీ వీసా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు, ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు రెండేళ్ల వర్క్ వీసా ఇచ్చేవారు.
US, UK, జర్మనీ ఇంకా ఆస్ట్రేలియా తర్వాత విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఫ్రాన్స్ అగ్ర ఎంపికలలో ఒకటి. నివేదికల ప్రకారం, 2021-22 అకడమిక్ సెషన్‌లో ఫ్రాన్స్‌లో దాదాపు 6,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు, వీరిలో 70 శాతానికి పైగా మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్నారు.
పారిస్‌లోని LA సెయిన్ మ్యూజికేల్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, "నేను చివరిసారి ఫ్రాన్స్‌కు వచ్చినప్పుడు, ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు 2 సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ వీసా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు, ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఐదేళ్ల దీర్ఘకాలిక పోస్ట్-స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించినట్లు." అన్నారు. అక్కడ ఉన్న ప్రజల నుంచి ఆయనకు ఘనస్వాగతం కూడా లభించింది.
ప్రస్తుతం ప్రధాని మోదీ రెండు రోజుల పారిస్ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున తన ఫ్రాన్స్ పర్యటనను "ప్రత్యేకమైనది" అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెసిడెంట్ మాక్రాన్‌తో మోడీ పాల్గొనున్నారు. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బహుముఖ భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో హైలైట్ చేశారు. ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించడం గురించి కూడా ఆయన ప్రకటించారు.