ఉద్దేశపూర్వకంగా హెచ్‌1 బీ వీసా నిబంధనలను 26 కంపెనీలు ఉల్లంఘించినట్లుగా అమెరికా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. టెంప్‌ సొల్యూషన్స్‌, టెలావా నెట్‌వర్క్‌, సు ప్రీమ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సహా మొత్తం 26 కంపెనీలు ఆ జాబితాలో ఉన్నట్టు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. 

భారత్‌కు చెందిన ఒక కంపెనీ సీఈఓను 200 రకాలుగా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు అభియోగం మోపుతూ కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. ఇక న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్దేశపూర్వకంగా హెచ్ 1 బీ వీసా ఉల్లంఘిస్తున్నందుకు మూడు లక్షల డాలర్ల జరిమానా విధించింది. అమెరికా ప్రభుత్వం. 
 
వీసాల జారీ విషయంలో కఠినంగా ఉండాలన్న ట్రంప్‌ వైఖరికి దీటుగా ప్రభుత్వ యంత్రాంగం వీసా నిబంధనలు కఠినం చేసింది. అమెరికాలో పని చేసేందుకు విదేశీయులను నియమించుకోవాలనుకునే కంపెనీలు వీసా లాటరీ కోసం ముందుగా ఎలక్ర్టానిక్‌ విధానంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆ లాటరీలో ఎంపికైన వారు మాత్రమే పూర్తి స్థాయి దరఖాస్తులు అన్ని పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. కాని దీని వల్ల తమకు పేపర్‌ వర్క్‌ బాగా పెరిగిందని కంపెనీలంటున్నాయి. అయితే 2013 నుంచి వీసా నిబంధనల అమలును సదరు సంస్థలు తుంగలో తొక్కాయన్న విషయం స్పష్టమవుతున్నది. 

గోల్డ్ ఈటీఎఫ్ లకు కష్టకాలమేనా? తగ్గిన డిపాజిట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు కలిసొచ్చేలా లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్ మధ్య కాలంలో మదుపరులు ఈ పథకాల నుంచి రూ.290 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

 గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.132 కోట్లు తక్కువ. దీంతో దేశంలోని 14 గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఎయుఎం) రూ.5,017 కోట్ల నుంచి రూ.4,621 కోట్లకు పడిపోయింది.
 
దేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. వరుసగా గత ఐదేళ్ల నుంచి దేశంలోని గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈక్విటీ మార్కెట్లో అధిక రాబడులు రావటం, పేపర్‌ గోల్డ్‌ కంటే బంగారం కడ్డీలు, నాణేలు, బిస్కట్లపై ప్రజలకు ఉన్న మోజు, ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.