Asianet News TeluguAsianet News Telugu

ఇది కదా...భారతీయుల సత్తా...అమెరికాలో 4.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న 160 భారతీయ కంపెనీలు..

అమెరికాలో భారతీయులు సత్తా చాటుతున్నారు ఏకంగా 160 కంపెనీలు అమెరికాలో 40 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టి నాలుగు లక్షల 25 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ఒకప్పుడు భారత్ ఇతర దేశాలను పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించింది కానీ ఇప్పుడు భారతీయులే అమెరికా లాంటి అగ్ర దేశంలో పెట్టుబడులు పెట్టి అక్కడ ఉద్యోగాలను సృష్టిస్తున్నారు.

160 Indian companies providing jobs to 4.25 lakh people in America MKA
Author
First Published May 4, 2023, 11:51 AM IST

భారత్ విదేశీ పెట్టుబడుల కోసం ఎదురు చూడటం ఒకప్పటి ట్రెండ్… ఇప్పుడు  భారతీయులే అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలకు ఉద్యోగాలు కనిపిస్తున్నారు అది ఇప్పటి ట్రెండ్.  అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం భారతీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికానులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒకటో రెండో కాదు ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలను భారతీయ కంపెనీలు అమెరికన్ల కు కల్పిస్తున్నాయి.  దీనికి సంబంధించిన ఒక నివేదిక ప్రస్తుతం సంచలనంగా మారింది.

భారతీయ కంపెనీలు అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి. తాజా అమెరికాలో 163 భారతీయ కంపెనీలు 40 బిలియన్ డాలర్లకు పెట్టుబడి పెట్టాయి. దీంతో 425,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి.  ఇది భారతీయ కంపెనీ పెట్టుబడి మార్కెట్ ప్రపంచవ్యాప్త విస్తరణకు సూచిక అని నిపుణులు చెబుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) 'ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్' తాజా ఎడిషన్ ప్రకారం, పెట్టుబడి విలువ పరంగా టెక్సాస్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో భారతీయ పెట్టుబడులను కలిగి ఉంది. తర్వాత జార్జియా, న్యూజెర్సీ, న్యూయార్క్, మసాచుసెట్స్ ఉన్నాయి. భారతీయ కంపెనీలు రిమోట్ వర్క్ ద్వారా దాదాపు 35,000 US ఉద్యోగాలను సృష్టించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గరిష్ట ఉద్యోగ కల్పన గురించి చర్చిస్తే, 2022 నాటికి టెక్సాస్‌లో 20,906 ఉద్యోగాలు సృష్టి జరిగింది. న్యూయార్క్‌లో 19,162 ఉద్యోగాలు, న్యూజెర్సీలో 17,713, వాషింగ్టన్‌లో 14,525 ఉద్యోగాలు వచ్చాయి.

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో 220 కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సదన్సులో USAలోని 220కి పైగా భారతీయ కంపెనీల ప్రతినిధులతో పాటు  అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సైతం పాల్గొన్నారు. అనంతరం ఆయన నివాసం ఇండియా హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఓ నివేదిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య శాఖ సీనియర్ అధికారులు భారత్-అమెరికా వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. 

అయితే 2020లో ప్రచురించిన CII నివేదిక చివరి ఎడిషన్‌లో 155 భారతీయ కంపెనీలు USలో 22 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయని  125,000 ఉద్యోగాలను సృష్టించాయని చూపించింది. 2023 నివేదిక కూడా USలో 29 శాతం భారతీయ పెట్టుబడులు లైఫ్ సైన్స్, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉన్నాయని పేర్కొంది. 21 శాతం కంపెనీలు IT, టెలికామ్‌లో, 18 శాతం తయారీలో, 10 శాతం ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్, డిజైన్ సర్వీసెస్‌లో, 5 శాతం ఆటోమోటివ్‌లో, 4 శాతం ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో, 3 శాతం టూరిజం, హాస్పిటాలిటీలో, 2 శాతం ఎనర్జీలో ఉన్నాయి. .

ఆర్ అండ్ డిలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి 

భారతీయ కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D)లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం దాదాపు 195 మిలియన్ డాలర్లు వెచ్చించాయి. సర్వేలో పాల్గొన్న 83 శాతం కంపెనీలు వచ్చే ఐదేళ్లలో యుఎస్‌లో తమ పెట్టుబడులను పెంచాలని యోచిస్తున్నాయని, 85 శాతం మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios