Asianet News TeluguAsianet News Telugu

సిబ్బంది జీతాలపై చేతులెత్తేసిన జెట్ ఎయిర్‌వేస్

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ తమ సంస్థ సిబ్బందిని నిరాశకు గురిచేసింది. నెలలుగా జీతాలు లేకుండా పనిచేసిన సిబ్బందికి.. ఇప్పుడే ఆ మొత్తాలను ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

"Banks Unable To Make Salary Commitments:" Jet Airways CEO   Vinay Dube To Employees
Author
New Delhi, First Published Apr 26, 2019, 5:47 PM IST

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ తమ సంస్థ సిబ్బందిని నిరాశకు గురిచేసింది. నెలలుగా జీతాలు లేకుండా పనిచేసిన సిబ్బందికి.. ఇప్పుడే ఆ మొత్తాలను ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

సంస్థ విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేతనాల చెల్లింపులకు నిధులు సర్దుబాటు చేయలేమని బ్యాంకుల కన్సార్టియం తెలిపిందని జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ వినయ్ దూబే చెబుతూ  సిబ్బందికి  ఓ లేఖ రాశారు.

బిడ్డింగ్ ప్రక్రియను కొనసాగిస్తూనే సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు కొన్ని నిధులు విడుదల చేయాలని తాము కోరగా బ్యాంకులు అందుకు నిరాకరించాయని ఆయన తెలిపారు. జీతాలు రాక తమ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే వేరే ఉద్యోగులు వెతుక్కోవడం తప్ప వారికి మరో మార్గం లేదని అన్నారు.

ఉద్యోగుల సమస్యను తాము బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లగా దీనిపై కంపెనీ షేర్ హోల్డర్లే నిర్ణయం తీసుకోవాలని తేలిగ్గా తేల్చేశారని తెలిపారు. బోర్డు సమావేశాల్లోనూ వేతన బకాయిల చెల్లింపునకు ప్రమోటర్లు, వ్యూహాత్మక వాటాదారును కోరినా వారి నుంచి సానుకూల స్పందన రాలేదని వివరించారు. 

ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని చెప్పారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక మే 10న జరిగే చివరి బిడ్డింగ్‌పైనే జెట్ ఎయిర్‌వేస్ ఆశలుపెట్టుకుంది.

సంబంధిత వార్త: జెట్ లేని చోట: రికార్డులు సృష్టిస్తున్న ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు

Follow Us:
Download App:
  • android
  • ios