PM Vishwakarma Yojana: ఈ వృత్తులవారికి రూ. 2 లక్షలు లోన్ పొందే పథకం ఇదే.. ఇలా పొందవచ్చు

పీఎం విశ్వకర్మ పథకం గురించి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా చేతివృత్తుల కళాకారుల సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. ఈ పథకం ప్రయోజనాలు ఏమిటీ? ఎలా పొందాలి వంటి వివరాలను చూద్దాం.
 

what is pm vishwakarma scheme and how to avail the same which mentioned in union budget speech kms

Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. అందులో పీఎం విశ్వకర్మ యోజనా గురించీ మాట్లాడారు. ఈ పథకం చేతివృత్తులవారికి దన్నుగా నిలుస్తున్నదని వివరించారు. చేతువృత్తుల కమ్యూనిటీ ఎదగడానికి దోహదపడుతున్నదని వివరించారు. ఇంతకీ ఈ పథకం ఏమిటీ? ఈ పథకం కింద అతి తక్కువ వడ్డీతో రుణాలు పొందడం ఎలా? ఎవరు అర్హులు? వంటి వివరాలు చూద్దాం.

ఈ సథరం 2023-24 నుంచి 2027-28 ఐదేళ్ల వరకు అమలవుతుంది. గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పనిముట్లను ఉపయోగించి పని చేసే చేతివృత్తుల వారిని ఉద్దేశించి  ఈ పథకం రూపొందించారు. ఈ పథకం ద్వారా పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్‌తోపాటు తొలి విడత రూ. 1 లక్ష, రెండో విడత రూ. 2 లక్షల రుణాన్ని కేవలం 5 శాతం వడ్డీ(50 పైసల వడ్డీ కంటే కూడా తక్కువ)తో అందిస్తారు.

వీరు అర్హులు:

తొలిగా 18 సంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం వర్తించనుంది. వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు,రాతి పని చేసేవారు, చెప్పులు కుట్టేవారు, మేషన్, తాపీ పని చేసేవారు, బుట్టలు, చాపలు, చీపులు, తాళ్లు అల్లేవారు, సాంప్రదాయ బొమ్మలు రూపొందించేవారు, క్షురకులు, పూలదండులు అల్లేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తె, పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారికి ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద రుణాలతో పాటు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు.

కావాల్సినవి:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు ఉండాలి. అడ్రెస్ ప్రూఫ్ కోసం రెంటల్ అగ్రిమెంట్ లేదా యుటిలిటీ బిల్లులు ఉండాలి. లేదంటే ఇతర అడ్రెస్ ప్రూఫ్ అయినా ఉండాలి. ఆధాయ ధ్రువీకరణ పత్రంతోపాటు వృత్తిపరమైన సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. 

ఇలా దరఖాస్తు చేసుకోవాలి:

ముందుగా https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. మెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. దరఖాస్తును నింపి సరిగా చూసుకుని సబ్మిట్ చేయాలి. అనంతరం, మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. అందులో అప్లికేషన్‌కు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. దాని ఆధారంగా ఆ తర్వాత అప్లికేషన్ పురోగతి వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆ దరఖాస్తును పరిశీలించి అన్ని అర్హతలుంటే అర్హులుగా ఎంపిక చేస్తుంది. అర్హులుగా ఎంపికైన తర్వాత పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios