Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2022...వచ్చే వందేళ్ల కోసం రూపొందించిన బడ్జెట్: మోడీ

యువతకు ఉజ్వల భవిష్యత్తు కోసం బడ్జెట్ ను  రూపొందించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. కేంద్ర బడ్జెట్ పై మంగళవారం నాడు ప్రధాని మోడీ స్పందించారు. 

Upliftment of poor key focus, says Modi
Author
New Delhi, First Published Feb 1, 2022, 3:25 PM IST

న్యూఢిల్లీ: వచ్చే వందేళ్ల కోసం ఈ బడ్జెట్ ను రూపొందించామని ప్రధాన మంత్రి Narendra Modi చెప్పారు. Union Budget 2022 పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు స్పందించారు. దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.

అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.దేశ ఆర్ధిక వ్యవస్థ సరైన దిశలోనే ఉందన్నారు. ఇంటర్నెట్, టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామన్నారు. Ganga నది ప్రక్షాళనకు పెద్దపీట వేశామన్నారు. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ద వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 

68 శాతం దేశీయ పరిశ్రమలకు లాభం  చేకూరనుందన్నారు.  Empoyees, మౌళిక వసతులు, అభివృద్ది ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్ లో భారత రక్షణకు పెద్దపీట వేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఆశలు, అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఇది ఆర్ధిక వ్యవస్థను బలపరుస్తుందన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలు, ఎక్కువ పెట్టుబడి, మరింత వృద్ది, ఉద్యోగాల కోసం ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. 

ఇది ప్రగతిశీల బడ్జెట్ అని మోడీ చెప్పారు. మానవ జీవితంలో టెక్నాలజీ భాగమైందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు వచ్చాయన్నారు. ప్రతి పేదవాడికి స్వంత ఇళ్లు ఉండాలన్నారు.  ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలని మోడీ కోరుకొన్నారు. కిసాన్ డ్రోన్లు,  డిజిటల్ కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. బ్యాంకింగ్ రంగంలో కొత్తగా డిజిటల్ యూనిట్లు తీసుకొస్తున్నట్టుగా ప్రధాని మోడీ గుర్తు చేశారు.  జాతీయ ఆరోగ్య  పథకం కింద డిజిటల్ ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నామన్నారు.

ఈ బడ్జెట్ లోని ముఖ్యమైన అంశం పేదల సంక్షేమంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, కుళాయి ద్వారా నీరు, మరుగు దొడ్డి, గ్యాస్ సౌకర్యం కల్పించడంపై ప్రత్యేకించి కేంద్రీకరించామన్నారు. సామాన్య ప్రజల నుండి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ లో  పేదల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. హిమాచల్ , ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభించడం దేశంలోనే తొలిసారి అని మోడీ గుర్తు చేశారు. పర్వాతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను నిర్మించనున్నట్టుగా మోడీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios