Budget Expectations 2024 : ఉద్యోగ భద్రత, పన్ను తగ్గింపులు.. యవత ఆశలు ఫలించేనా?

సామాజిక ఆవిష్కరణ వేదిక అయిన హంచ్, 2024-25 యూనియన్ బడ్జెట్‌లో జెన్ జెడ్ తరం ఏం కోరుకుంటుందో ఒక పోల్ నిర్వహించింది. దాంట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

Budget Expectations 2024 : Job Security, Tax Cuts.. Will Gen Z's Hopes Come True? - bsb

బడ్జెట్ 2024 : దేశంలో ఇది ఎన్నికల సంవత్సరం. ఇక రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కీలకమైన ఎన్నికల సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండడంో అందరి దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బడ్జెట్‌పైనే ఉంది. జెన్ జెడ్ తరం.. అంటే, 1990-2010ల ప్రారంభంలో జన్మించిన తరం. వీరు కేంద్ర బడ్జెట్ నుంచి చాలా ఆశిస్తున్నారు. బడ్జెట్ లో ఉండే ప్రత్యేక ప్రాధాన్యతలు.. తమ ఆందోళనను అడ్రెస్ చేస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

కేంద్ర బడ్జెట్ నుండి GenZలు కోరుకుంటున్న కొన్ని కీలకవిషయాలు ఇవి... 

సామాజిక ఆవిష్కరణ వేదిక అయిన హంచ్, 2024-25 యూనియన్ బడ్జెట్‌లో జెన్ జెడ్ తరం ఏం కోరుకుంటుందో ఒక పోల్ నిర్వహించింది. దాంట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

పోల్ కీలక ఫలితాలు ఇలా ఉన్నాయి.. 

ఉద్యోగావకాశాలు
హంచ్ తన ప్లాట్‌ఫారమ్‌లో చేసిన పోల్ ఫలితాల ప్రకారం, 3250 GenZలు పాల్గొన్నారు. వీరిలో లో 60.9% మంది ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగావకాశాల్లో పెరుగుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లౌడ్ బడ్జెటింగ్ : ఈ ట్రెండ్ ఫాలో అయితే మీకు బోలెడు డబ్బు ఆదా..

పన్ను తగ్గింపులు
ఇదే పోల్ లో 22.6% జెన్ జెడ్ యూజర్లు ఇప్పటివరకు ఉన్న పన్ను విధానంలో తగ్గింపుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరో 16.5% మంది ఉద్యోగ భద్రతను నిర్ధారించే చర్యలు బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని.. అది ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు.

నేటి యువత ముఖ్యంగా పన్ను రాయితీలను కోరుతూ ఆర్థిక మాంద్యం, ఉద్యోగ నష్టాల నుండి రక్షణ కల్పించడంలో శ్రద్ధ వహిస్తున్నట్లు ఈ పోల్ ఫలితాలు చెబుతున్నాయని హంచ్ అంటోంది. 

ఇంకొకటి గమనిస్తే.. ఈ ఫలితాలు నేటి యువతలో ఉన్న రకరకాల అభిప్రాయాలు, వ్యక్తిగత ఆందోళనలను నొక్కిచెబుతున్నాయి, ఉమ్మడిగా ఆర్థిక స్థిరత్వం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. పన్ను తగ్గింపులు,  స్థిరమైన ఉపాధి అవకాశాల హామీలు ఈ విస్తృతమైన లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన భాగాలు అని పోల్ చెబుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios