Asianet News TeluguAsianet News Telugu

లౌడ్ బడ్జెటింగ్ : ఈ ట్రెండ్ ఫాలో అయితే మీకు బోలెడు డబ్బు ఆదా..

"లౌడ్ బడ్జెట్" సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బడ్జెటింగ్ ట్రెండ్. ముఖ్యంగా యువత తమ ఖర్చుల మీద నియంత్రణ కోసం ఈ ట్రెండ్ ను తెగ ఫాలో అవుతున్నారు. 

Loud Budget : If you follow this trend, you will save a lot of money see - bsb
Author
First Published Jan 25, 2024, 10:19 AM IST

"లౌడ్ బడ్జెటింగ్"  సోషల్ మీడియాలో జెన్ జెర్‌లు, మిలీనియల్స్ డబ్బు ఆదా చేయడానికి, పొదుపు చేయడానికి ఈ ట్రెండ్ ను తెగ ఫాలో అవుతున్నారు. తమ "లౌడ్ బడ్జెటింగ్"  ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. 

ఈ లౌడ్‌బడ్జెటింగ్ ట్రెండ్ ఇటీవల మొదలయ్యింది. ఇది మీ పొదుపు లక్ష్యాలను వేరేవారితో పంచుకోవడం.. వాటిగురించి గట్టిగా చెప్పడం లాంటింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిమీద ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ.. ఒక విధంగా ఈ వైరల్ ట్రెండ్ వల్ల అనవసరమైన కొనుగోళ్లు చేయకుండా ఉండేలా వీరికి సహాయపడుతుందని అంటున్నారు. తమకు ఏం కావాలో, దేనికి ఖర్చుపెట్టాలో నిర్ణయించుకోగలుగుతున్నారు.  

లౌడ్ బడ్జెటింగ్ అంటే మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు. అనవసరమైన వాటికి ఖర్చుపెట్టకుండా ఉండడం. దాన్ని ఖర్చుపెట్టకపోతే ఎవరేమనుకుంటారో అనో, పరువు కోసమో, తప్పదన్నట్టుగానో ఖర్చు చేయడం కాకుండా.. మీ ఆర్థిక ఆలోచనలను స్పష్టంగా మీ స్నేహితులు, పరిచయస్తులు, కుటుంబసభ్యులకు చెప్పడం. 

ఎలాగంటే.. మీ స్నేహితులందరూ కలిసి డిన్నర్ కి వెళ్లాలని ప్లాన్ చేశారనుకోండి. మీరు వెంటనే "లౌడ్ బడ్జెటింగ్" అని పెట్టొచ్చు. అంటే మీకు డిన్నర్ కు వెళ్లడం, డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేదని.. ఈ నెల ఖర్చులు చూసుకోవాలని హెచ్చరించడం.. జాగ్రత్త చెప్పడం లాంటిదన్నట్టు. మీ స్నేహితులతో ఆర్థిక పారదర్శకత విషయంలో ఇలా క్లియర్ గా ఉండొచ్చు.  

Budget 2024 : అతి ముఖ్యమైన 'లాక్-ఇన్' పీరియడ్ ప్రారంభం.. అంటే ఏంటంటే...

రోజురోజుకూ ధరలు, ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని సమన్వయం చేసుకోవడానికి, తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి తమ బడ్జెట్‌ గురించి గట్టిగా మాట్లాడడం మంచిదే అని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఉపయోగించవచ్చని చెప్పారు.

"బిగ్గరగా బడ్జెట్ చేయడం, ఇది పదాలు మాత్రమే కాదు, ఈ సాధనాలను కూడా కలిగి ఉంటుంది" అని అలిచే చెప్పారు. "ఇది మిమ్మల్ని జవాబుదారీగా ఉంచుతుంది. కానీ, మీ పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు కూడా మిమ్మల్ని జవాబుదారీగా ఉంచడానికి ఇది అనుమతిస్తుంది."

దీంట్లో భాగంగా మరికొంతమంది. డబ్బును ఆదా చేయడానికి విజువల్ రిమైండర్‌గా తన క్రెడిట్ కార్డ్‌పై "డియాక్టివేషన్ స్టిక్కర్"ని పెట్టుకుంటున్నారు. దీనివల్ల క్రెడిట్ కార్డ్ వాడడానికి తీసినప్రతీసారి.. ఈ స్టిక్కర్ మిమ్మల్ని మీ గోల్ విషయంలో అలర్ట్ చేస్తుంది. లౌడ్ బడ్జెటింగ్ ఫాలో అవుతున్నారని గుర్తుచేస్తుందని.. చెబుతున్నారు.  

దీనికి చేయాల్సిందల్లా.. 

మనీలిస్ట్ తయారు చేసుకోండి
క్రెడిట్, డెబిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను చెక్ చేసుకోండి
డబ్బును కెటగిరీ వైజ్ గా విడగొట్టండి
ప్రతి కేటగిరీలో నెలకు మీ ఖర్చు ఎంతో రాసుకోండి

దీనికోసం వీలైతే మీ మొత్తం డబ్బంతా ఒకే అకౌంట్ లో కాకుండా.. రెండు మూడు అకౌంట్ లు పెట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలా ఒకటి బిల్లుల కోసం, మరొకటి పొదుపు కోసం, ఇంకోటి వినోద కొనుగోళ్ల కోసం.. ఇలా విభజించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులకు దూరం ఉండొచ్చని చెబుతున్నారు.

చివరగా ఒక మాట..
ఈ లౌడ్ బడ్జెటింగ్ అనే పదం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.. కానీ, ఇది మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటే. సంపాదనకు, ఖర్చుకు లెక్కాపత్రం ఉండాలని చెబుతుండేవాళ్లు. అవసరాలు రాసుకుని.. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలని, పొదుపు ముఖ్యం అని, అప్పులు చేయకుండా వచ్చినదాంట్లో ఎలా బతకాలో మనపెద్దలు చేశారు. మనకూ చెప్పారు. ఇప్పుడదే సోషల్ మీడియాలో రూపు మార్చుకుని ట్రెండ్ గా మారి.. యువతను ఆకర్షిస్తుంది. 

సరే, ఏదేమైనా మరి మీరు ఈ లౌడ్ బడ్జెట్ ను ఫాలో అవుతున్నారా?
 

Follow Us:
Download App:
  • android
  • ios