Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 24 : బాలికల ఆరోగ్యానికి నిర్మలమ్మ రక్ష.. 9-14 యేళ్ల అమ్మాయిల ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్..

ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్యంతర బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. సక్షం అంగన్‌వాడీ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పోషకాహార పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధిని మెరుగుపరచడం కోసం పోషణ్ 2.0ని వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Budget 24: Nirmala sitharaman Special focus on girls' health, aged 9-14 years - bsb
Author
First Published Feb 2, 2024, 7:07 AM IST

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలకు, అలాగే స్త్రీలు,  శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులను స్వల్పంగా పెంచారు.

అయితే పార్లమెంట్‌లో ఆమె బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశం యువతుల ఆరోగ్యంపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించడం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు 9-14 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తుందని సీతారామన్ చెప్పారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు మా ప్రభుత్వం 9-14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు.

భారతదేశంలో, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఇండియా (SII) గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణకు..మొట్టమొదటి స్వదేశీ HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సిన్, సెర్వవాక్‌తో ముందుకు వచ్చింది. దేశ రోగనిరోధకత కార్యక్రమంలో ఈ టీకాని చేర్చడం వలన ఔషధం ఖర్చు తగ్గుతుంది.

budget 2024: స్టాక్ మార్కెట్‌పై ఎఫెక్ట్.. గత 10 ఏళ్లలో సెన్సెక్స్-నిఫ్టీలో ప్రయాణం ఇలా..

“గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు టీకాలు వేయాలని భారత ప్రభుత్వం చేసిన ప్రకటనను నేను అభినందిస్తున్నాను. హెచ్ పీవీని నిరోధించడానికి, టీకాను సులభంగా యాక్సెస్ చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం" అని పూణేకు చెందిన ఎస్ఐఐ సీఈఓ అదార్ పూనావాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో సంతోషం వ్యక్తం చేశారు. 

ఫ్లాగ్‌షిప్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ,సహాయకులందరికీ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించే పోషణ్ పథకాన్ని అప్‌గ్రేడ్ చేయడం, బలోపేతం చేయడం కూడా ఇందులో చేర్చింది. 

సీతారామన్ ఫైనార్స్ ఇయర్25 కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రూ.90,658 కోట్లు కేటాయించారు, ఇది గత సంవత్సరం కంటే కేవలం 1.68% మాత్రమే పెరిగింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసీడీ)కి రూ.26,092 కోట్లు కేటాయించబడింది. ఇది ఎఫ్ వై24 కంటే 2.53% ఎక్కువ. డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖకు ఈసారి రూ. 26,212 కోట్లు కేటాయించబడుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అవే నిజం అయ్యాయి.

ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్యంతర బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. సక్షం అంగన్‌వాడీ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పోషకాహార పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధిని మెరుగుపరచడం కోసం పోషణ్ 2.0ని వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. డబ్ల్యూసీడీ ఇంటిగ్రేటెడ్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 స్కీమ్ కోసం బడ్జెట్ రూ.21,200 కోట్లు అందించింది. ఈ పథకం పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోప సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

2018లో ప్రారంభించబడిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం. ఈ పథకానికి రూ. 7,500 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కంటే దాదాపు 4% ఎక్కువ.

ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే పథకాలకు ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నట్టుగానే... అంగన్‌వాడీ సేవలు మిషన్ పోషణ్ కేటగిరీలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) కార్యక్రమం కిందకు వస్తాయి. డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖ వారి కొనసాగుతున్న పథకాలను మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ పోషణ అనే మూడు ప్రధాన విభాగాలుగా విభజించింది.

“మా అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల కృషి విలువైనదని గుర్తించడం సంతోషకరం. కేంద్రం మా కోసం ఆయుష్మాన్ భారత్‌ను విస్తరింపజేయడాన్ని పరిశీలిస్తుంన్నందుకు మేము కృతజ్ఞతతో ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమం ఎలా అమలు చేయబడుతుందో, అది మనకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎలా సైన్ అప్ చేయాలో మెజారిటీ అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు తెలియదు" అని ఢిల్లీకి చెందిన ఆశా వర్కర్ కవిత అన్నారు.

ఇమ్యునైజేషన్ నిర్వహణ కోసం కొత్తగా నిర్వచించిన యు-విన్ ప్లాట్‌ఫారమ్, మిషన్ ఇంద్రధనుష్ కోసం ప్రయత్నాలను వేగవంతం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios